Tanvir Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (Chennai Super Kings vs Lucknow Super Giants) మధ్య ఎంఏ చిదంబరం స్టేడియం (MA Chidambaram Stadium, Chennai) వేదికగా మ్యాచ్ నిర్వహించారు. ఇందులో అద్భుతంగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శివమ్ దుబే వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్ లో 13 బంతు ల్లో ఉర్విల్ పటేల్ అర్థ సెంచరీ నమోదు చేసి.. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. అయితే భయంకరమైన ఇన్నింగ్స్ ఆడిన ఉర్విల్ పటేల్ గురించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ (Tanvir Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉర్విల్ పటేల్ ( Urvil Patel) బ్యాట్లను చెక్ చేయాలని.. అందులో స్ప్రింగులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అతనికి డోపింగ్ టెస్టులు కూడా నిర్వహించాల్సిందే అంటూ బాంబు పేల్చాడు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో (Indian Premier League 2026 Tournament) భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (Chennai Super Kings vs Lucknow Super Giants) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా చెన్నై ఆటగాడు ఉర్విల్ పటేల్… ఆకాశం ఉరిమినట్లుగానే విరుచుకుపడ్డాడు. బౌలర్లకు చుక్కలు చూపించాడు. 13 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసిన ఉర్విల్ పటేల్, మొత్తంగా 65 పరుగులకు ఔట్ అయ్యాడు. ఇందులో ఎనిమిది సిక్సర్లు అలాగే రెండు బౌండరీలు మాత్రమే ఉన్నాయి.
దాదాపు 300 స్ట్రైక్ రేట్ సంపాదించాడు ఉర్విల్ పటేల్ ( Urvil Patel). అయితే ఇతని బ్యాటింగ్ పై తన్వీర్ అహ్మద్ అనుమానాలు వ్యక్తం చేశారు. అతనికి డోపింగ్ టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే అతని బ్యాట్ లో స్ప్రింగులు ఉన్నాయా ? అనే దానిపైన చెక్ చేయాల్సిందేనని కోరారు. ఇంత భయంకరంగా ఏ ఆటగాడు ఆడబోడని వివరించారు. ఐపీఎల్ లో క్రికెటర్ల ప్రదర్శన గురించి మొదటి నుంచి తాను మొత్తుకుంటున్నట్లు గుర్తు చేశారు. వెంటనే దీనిపైన ఐసీసీ యాక్షన్ తీసుకొని అందరిని విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అటు వైభవ్ సూర్య వంశీ పైన కూడా ఇలాగే తన్వీర్ అహ్మద్ వ్యవహరించాడు.
🚨 Urvil Patel dedicated this knock to his father. 💛
" THIS IS FOR YOU PAPA ❤️" #CSKvsLSG pic.twitter.com/noUX1xXyy4
— Indian Cricket (@IPL2025Auction) May 10, 2026