E-Paper
Advertisement

AIIMS: భారీ జీతం.. బంగారం లాంటి భవిష్యత్తు, ఎయిమ్స్‌లో భారీగా ఉద్యోగాలు

AIIMS: భారీ జీతం.. బంగారం లాంటి భవిష్యత్తు, ఎయిమ్స్‌లో భారీగా ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నగారా మోగింది. న్యూదిల్లీ ఎయిమ్స్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లోని అనుబంధ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్)-10 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. మార్చి 16వ తేదీని దరఖాస్తులకు చివరి గడువుగా నిర్ణయించారు.

ఏఏ సంస్థల్లో ఉద్యోగాలు.. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భటిండా, భోపాల్, భువనేశ్వర్, దేవ్‌ఘర్, గోరఖ్‌పూర్, గువాహటి, కల్యాణి, మంగళగిరి, నాగ్‌పుర్, రాయ్‌బరేలీ వంటి ప్రధాన కేంద్రాలతో పాటు న్యూ ఢిల్లీ, పట్నా, రిషికేశ్, విజయ్‌పూర్ సంస్థల్లో నియామకాలు చేపడతారు.

వీటితో పాటు సీఏపీఎఫ్ ఐఎంఎస్, ఎన్‌ఐటీఆర్‌డీ, సీఐపీ రాంచీ, జిప్మర్ కరైకల్, ఈఎస్ఐసీ న్యూదిల్లీ వంటి సంస్థల్లో సైతం నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు.. 

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ సర్టిఫికేట్ లేదా పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. డిప్లొమా (జీఎన్‌ఎం) అర్హత ఉన్నవారు రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండటం తప్పనిసరి. అభ్యర్థులందరూ తప్పనిసరిగా స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.

వయస్సు..

వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు వర్తిస్తుంది.

జీతం..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,300 నుండి రూ.34,800 వేతన శ్రేణితో పాటు రూ.4,600 గ్రేడ్ పే అందుతుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ.. 

ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) నిర్వహిస్తారు. తొలుత స్టేజ్-1 ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి స్టేజ్-2 మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ప్రతిభ చూపిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది జాబితా రూపొందిస్తారు.

ముఖ్యమైన తేదీల వివరాలు.. 

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా మార్చి 16వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు పూర్తి చేయాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.3,000 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారు రూ.2,400 చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 4న సిటీ ఇంటిమేషన్ వివరాలు వెల్లడిస్తారు. ఏప్రిల్ 8న అడ్మిట్ కార్డులు విడుదల అవుతాయి. ప్రిలిమినరీ పరీక్ష ఏప్రిల్ 11న, మెయిన్ పరీక్ష ఏప్రిల్ 30న నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://aiimsexams.ac.in/

ALSO READ: Anthropic CEO Dario Amodei: దూసుకొస్తున్న ఏఐ.. ఈ రంగాల్లో ఉద్యోగాలు ఔట్..

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×