Team India 2026 Schedule: 2026 కొత్త సంవత్సరంలో టీమిండియా ( Team India 2026 Schedule ) ఫుల్ బిజీగా మారనుంది. ఈ సంవత్సరంలో విపరీతమైన మ్యాచ్లతో ప్లేయర్లు ఉక్కిరిబిక్కిరి కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. జనవరి మాసంలోనే న్యూజిలాండ్ జట్టుతో తమ కొత్త సంవత్సరం ప్రారంభించినది టీమిండియా. ఇక ఈ సంవత్సరంలో టీమిండియా ఆడే మ్యాచ్ల వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.
2026 జనవరిలో స్వదేశంలోనే న్యూజిలాండ్ తో టీమిండియా ఫైట్ ఉండనుంది. ఇందులో టి20లతో పాటు వన్డేలు కూడా ఉంటాయి. జనవరి 11వ తేదీ నుంచి న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కొనసాగనుంది. టి20 వరల్డ్ కప్ కంటే ముందు ఈ టోర్నమెంట్ నిర్వహించి బీసీసీఐ భలే స్కెచ్ వేసింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో 7వ తేదీన టి20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. దాదాపు నెలరోజులపాటు ఈ టోర్నమెంట్ కారణంగా టీమ్ ఇండియా ప్లేయర్లు బిజీగా మారనున్నారు. ఆ తర్వాత ఐపీఎల్ లో ఫుల్ బిజీ అవుతారు. ఆ టోర్నమెంట్ మే 31వ తేదీ వరకు కొనసాగనుంది. జూన్ మాసంలో ఆఫ్ఘనిస్తాన్ తో మూడు వన్డేలతో పాటు ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది టీం ఇండియా. అనంతరం జులై మాసంలో ఇంగ్లాండుతో ఐదు టి20 లు ఆడనుంది.
అంతేకాదు మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఆ తర్వాత ఆగస్టులో శ్రీలంకతో రెండు టెస్టులు ఉంటాయి. సెప్టెంబర్ మాసంలో మరోసారి ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో మూడు టి20 లు జరగనున్నాయి. ఆ వెంటనే వెస్టిండీస్ జట్టుతో మూడు వన్డేలు ఆడనుంది టీమిండియా. అదే జట్టుతో ఐదు టి20 లు కూడా టీమిండియా ఆడుతుంది. అక్టోబర్-నవంబర్ మాసాలలో న్యూజిలాండ్తో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఇక డిసెంబర్ మాసంలో శ్రీలంకతో మూడు వన్డేలు అలాగే మూడు టి20 లో ఆడనుంది టీమిండియా. బంగ్లాదేశ్ తో కూడా వన్డేలు ఇప్పటికే జరగాల్సి ఉండేది. ఇరు దేశాల మధ్య సంబంధాల నేపథ్యంలో ఆ వన్డే సిరీస్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ సంవత్సరం ఆ టోర్నమెంట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2026 సంవత్సరంలో రోహిత్ శర్మతో ( Rohit Sharma) పాటు విరాట్ కోహ్లీ ( Virat Kohli) వన్డేలు ఆడనున్నారు. ఏకంగా 18 వన్డేల్లో ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. గాయాలు అయితే తప్ప అన్ని మ్యాచ్లలోనూ ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఆడుతారు.
Team India 2026 schedule….
29 – T20
21 – ODIs
5 – Test📍 Jan : 3 ODIs, 5 T20 vs NZ 🏡
📍Feb : 2026 T20 WC 🏡✈️
📍Mar to May : IPL Season
📍June : 1 Test, 3 ODIs vs Afg 🏡
📍 July : 3 ODIs, 5 T20 vs Eng ✈️
📍 Aug : 2 Test vs SL
📍Sep : 3 ODIs & 3 T20 vs Ban ✈️…see pic.twitter.com/MG009Qzg6Y
— 𝐎𝐧𝐥𝐲 𝐂𝐫𝐢𝐜𝐤𝐞𝐭 (@gurlabhsingh610) January 1, 2026