E-Paper
Advertisement

Cell Phone Shop Attack: రూ. 60 స్క్రీన్ గార్డ్ డబ్బుల కోసం కత్తులతో హల్చల్.. చదర్‌ఘాట్‌లో గంజాయి బ్యాచ్ వీరంగం!

Cell Phone Shop Attack: రూ. 60 స్క్రీన్ గార్డ్ డబ్బుల కోసం కత్తులతో హల్చల్.. చదర్‌ఘాట్‌లో గంజాయి బ్యాచ్ వీరంగం!
Advertisement

Cell Phone Shop Attack: హైదరాబాద్ పాతబస్తీలో గంజాయి మత్తులో యువకులు మరోసారి రెచ్చిపోయారు. చిన్న కారణంతో మొదలైన గొడవను పెద్దది చేసి, కత్తులతో వీరంగం సృష్టించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. చదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

చదర్‌ఘాట్‌లోని ముస్లిం మేటర్నటీ ఆసుపత్రి సమీపంలో ఉన్న ఓ సెల్ ఫోన్ రిపేర్ షాపుకు కొంతమంది యువకులు వచ్చారు. ఫోన్‌కు స్క్రీన్ గార్డ్ వేయించుకున్నారు. అయితే, ఆ స్క్రీన్ గార్డ్ ధర కేవలం రూ. 60. ఈ చిన్న మొత్తం విషయంలో షాపు యజమానితో సదరు యువకులు వాగ్వాదానికి దిగారు. అప్పటికే పూర్తిగా గంజాయి మత్తులో ఉన్న ఆ యువకులు, యజమానిపై బూతులతో విరుచుకుపడ్డారు.

Advertisement

వాగ్వాదం ముదరడంతో యువకుల ఆగడాలు మితిమీరాయి. “మేము లోకల్ రౌడీ షీటర్లం.. మాకే ఎదురు చెప్తావా?” అంటూ షాపు యజమానిపై దౌర్జన్యానికి దిగారు. ఈ క్రమంలో ఒక యువకుడు తన వెంట తెచ్చుకున్న కత్తిని బయటకు తీసి షాపు యజమానిని భయపెట్టాడు. అంతేకాకుండా, షాపు నడపాలంటే తమకు నెలనెలా మామూళ్లు (డబ్బులు) ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని బెదిరించారు.

ఈ దౌర్జన్యాన్ని షాపు యజమాని ధైర్యంగా తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. దీంతో నిందితుల బండారం బయటపడింది. కత్తితో హల్చల్ చేసిన వ్యక్తిని చదర్‌ఘాట్‌కు చెందిన సలీమ్‌గా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాడు. పాతబస్తీలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Read Also: NTR District: న్యూ ఇయర్ వేళ యువకుల మధ్య రగడ.. అర్ధరాత్రి కర్రలతో ఫైటింగ్, రంగంలోకి పోలీసులు

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×