E-Paper
Advertisement

BB Jodi Season 2 Promo: డ్యాన్స్ ఇరగదీసిన జోడీలు.. రాజా సాబ్ హీరోయిన్ల సందడి.. ప్రదీప్ పరువు తీసిన హీరోయిన్..

BB Jodi Season 2 Promo: డ్యాన్స్ ఇరగదీసిన జోడీలు.. రాజా సాబ్ హీరోయిన్ల సందడి.. ప్రదీప్ పరువు తీసిన హీరోయిన్..
Advertisement

BB Jodi Season 2 Promo: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ఇటీవలే పూర్తి అయ్యింది. కామన్ మాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్మీ ఉద్యోగి కళ్యాణ్ పడాల విన్నర్ గా నిలిచారు.. ఈ సీజన్ అలా ముగిసిందో లేదో బీబీ జోడీ మొదలైపోయింది. గతంలో వచ్చిన సీజన్ వన్ కు సీక్వెల్ గా బీబీ జోడి సీజన్ 2 రాబోతుంది. మొదటి ఎపిసోడ్ ని పూర్తి చేసుకున్న ఈ షో రెండో ఎపిసోడ్ ప్రోమోని తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రోమో ఎలా ఉందో ఒకసారి మనం చూసేద్దాం..

బీబీ జోడిలో ప్రభాస్ హీరోయిన్లు..

ఈ షోలో ప్రదీప్ పోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. గత సీజన్ కి శ్రీముఖి యాంకర్ గా చేసింది.. ప్రదీప్ లో ఉంటే ఆ షోలో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదన్న విషయం తెలిసిందే.. ఈ షో లో కూడా ప్రదీప్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఈ షో కు సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేశారు. ఆ ప్రోమో రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే బాగా వైరల్ అయింది. ఆ షో లోకి తాజాగా ప్రభాస్ నటించిన రాజా సాబ్ మూవీ హీరోయిన్లు సందడి చేశారు. నిధి అగర్వాల్ మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లోకి రాబోతున్న సందర్భంగా హీరోయిన్లు ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ముగ్గుర కలిసి ఈ షోలో సందడి చేశారు.. షోలోకి వచ్చిన హీరోయిన్లతో ప్రదీప్ పులిహార కలిపే ప్రయత్నం చేస్తాడు . నీది మాత్రం ప్రతి ఒక్కరితో ఇలానే చెప్తావా అనేసి ప్రదీప్ పరువు ని అడ్డంగా తీసేస్తుంది. ఆ మాట అనగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు.

Advertisement

Also Read :మాసోడి ‘ భర్త మహాశయులకు విజ్ఞప్తి ‘ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..?

ప్రోమో ఎలా ఉందంటే..? 

ఈ ప్రోమోలో ముందుగా ప్రదీప్ ప్రతి ఆదివారం ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు అంటూ మొదలు పెడతాడు. ఆ తర్వాత మా బీబీ జోడీలో ధమాకా జోడీలు దుమ్ము దులపడానికి రెడీగా ఉన్నారు అంటూ ప్రదీప్ అంటాడు. మణికంఠ, మానస్ లతో ప్రదీప్ మాట్లాడుతాడు.. దీనివల్ల మంచి క్రేజ్ అయితే వచ్చింది కదా.. అని అడుగుతాడు. అవును ఈ షో ద్వారా మంచి క్రేజ్ అయితే వచ్చింది అని మానస్ అంటాడు.. ఇక తర్వాత మణికంఠ ఈ షో కి నువ్వు హోస్ట్ గా ఉంటే బాగుండేది అని అంటున్నారని అంటాడు. ఆ మాట వినగానే ప్రదీప్ వేరే వాళ్ళ కామెంట్ ను చదివినట్లు ఉన్నావు అని అంటాడు. ఆ తర్వాత రాజా సాబ్ హీరోయిన్లు ఎంట్రీ ఇస్తారు.. వారితో ప్రదీప్ చేసే కామెడీ మామూలుగా ఉండదు. అయ్యే ఎపిసోడ్కి హైలెట్గా నిల్వనుంది. ఇక మానస్, శ్రేష్ఠ వర్మ ఇద్దరు అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇస్తారు.. వాళ్ళ పర్ఫామెన్స్ పై జడ్జిలు ప్రశంసలు కురిపిస్తారు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మొత్తానికి ప్రోమో అయితే చాలా బాగా ఉంది. ఇక ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలంటే మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Advertisement

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×