Team India -Divorce: టీమిండియా జట్టులో ఈ మధ్యకాలంలో విడాకుల జంటలు పెరిగిపోతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడిపోవడం టీమిండియాలో కూడా చాలా కామన్ అయిపోయింది. ఇప్పటికే యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా తమ సతీమణులకు విడాకులు ఇచ్చారు. అయితే ఈ లిస్టులోకి మరో స్టార్ క్రికెటర్ కూడా చేరిపోయాడు. టీమిండియా మాజీ డేంజర్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్, తన భార్య ఆర్తి అహ్లవత్ ( Aarti ) కు విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా దీపావళి సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ పెట్టిన పోస్ట్ ద్వారా ఈ విషయం బయటపడింది. తన భార్య లేకుండానే ఇద్దరు కొడుకులతో దీపావళి వేడుకలు చేసుకున్నారు వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ). ఈ ఫోటోలో ఆయన భార్య ఆర్తి అహ్లవత్ మాత్రం కనిపించలేదు. దీంతో వీరిద్దరు విడాకులు ( Virender Sehwag Divorce ) తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?
టీమిండియా ఒకప్పటి డేంజర్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో అడుగు పెట్టాడంటే సిక్సర్లు లేదా బౌండరీలు. అతడు 90 పరుగులు దాటాడంటే సెంచరీ కోసం కచ్చితంగా సిక్సర్ మాత్రమే కొడతాడు. అలాంటి డేంజర్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్, తన భార్య ఆర్తి అహ్లవత్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. దీపావళి సందర్భంగా తన భార్య ఆర్తి అహ్లవత్ లేకుండానే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తన తల్లి, ఇద్దరు కొడుకులతో కలిసి దీపావళి వేడుకలు చాలా గ్రాండ్ గా చేసుకున్నారు వీరేంద్ర సెహ్వాగ్. దీంతో తన భార్య ఆర్తి అహ్లవత్ కు వీరేంద్ర సెహ్వాగ్ దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దూరం కాదు, వాళ్ళిద్దరు ఇప్పటికే విడాకులు తీసుకున్నారని మరికొంతమంది ఈ ఫోటోల కింద కామెంట్స్ పెడుతున్నారు. ఏడాది కిందటే వీళ్ళు విడాకులు తీసుకున్నారని మరికొంతమంది అంటున్నారు.
ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ ( Mithun Manhas) కారణంగానే వీరేంద్ర సెహ్వాగ్ పచ్చడి కాపురంలో చిచ్చు వచ్చిందని జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. మిథున్ అలాగే వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు. ఇదే అదునుగా చేసుకున్న మిథున్, వీరేంద్ర సెహ్వాగ్ భార్య ఆర్తి అహ్లవత్ కు దగ్గరయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలుగా సీక్రెట్ రిలేషన్షిప్ కూడా కొనసాగిందట. ఇప్పటికే వాళ్లు కలిసే ఉంటున్నారని టాక్. ఈ నేపథ్యంలోనే తన భార్య ఆర్తి అహ్లవత్ ను వీరేంద్ర సెహ్వాగ్ దూరం పెట్టినట్లు ఏడాది నుంచి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఆమెకు విడాకులు ఇచ్చేందుకు వీరేంద్ర సెహ్వాగ్ సిద్ధమైయ్యాడని అంటున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది
दीपज्योतिः परं ब्रह्म दीपज्योतिर्जनार्दनः । दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तुते ॥
May you leave your sparkle wherever you go. Happy Deepawali pic.twitter.com/6kaXAd8Xm1
— Virrender Sehwag (@virendersehwag) October 20, 2025