IND VS PAK: క్రికెట్ లో సెంచరీ చేయడం ఒక అరుదైన రికార్డ్. అదే డబుల్ సెంచరీ చేస్తే, ఆ క్రికెటర్ కు తిరిగి ఉండదు. అదే క్రికెటర్ ట్రిపుల్ సెంచరీ చేస్తే, హిస్టరీలో నిలుస్తాడు. రియల్ హీరో అయిపోతాడు. అయితే సెంచరీ చేసే ప్రతి ఒక్క క్రికెటర్ 90 పరుగులు దాటగానే నెమ్మదిగా ఆడతాడు. కానీ మనోడు మాత్రం ఎక్కడ తగ్గడు. 90 పరుగులు రాగానే బుల్లెట్ స్పీడ్ తో బ్యాటింగ్ చేస్తాడు. 95 దగ్గర రాగానే సిక్సర్ కొడతాడు. అక్కడితో ఆగుతాడా ? అంటే అదీ లేదు.. 195 పరుగులు రాగానే మరో సిక్సర్.. 295 పరుగులు రాగానే మరో భారీ సిక్సర్. ఇలా 300 పరుగులు చేసి ఓ డేంజర్ ఆటగాడు చరిత్ర సృష్టించాడు. అలా ట్రిపుల్ సెంచరీ చేసి పాకిస్తాన్ దేశాన్ని వణికించాడు. ఇంతకు అతను ఎవరు అనుకుంటున్నారు ? అతను ఎవరో కాదు వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్. టీమిండియా ఒకప్పటి డేంజర్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో దిగాడు అంటే చాలు.. సిక్సర్లు బౌండరీలు. అవి తప్పితే సింగిల్ అస్సలు ఉండదు. అలా చాలా మంది బౌలర్లకు నరకం చూపించి వాళ్ళ కెరీర్ ను నాశనం చేసిన వీరుడు సెహ్వాగ్.
Also Read: INDW vs ENGW: స్మృతి , హర్మన్ పోరాటం వృధా…సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్..టీమిండియాకు ఇంకా ఛాన్స్
టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ ( Pakistan vs India, 1st Test ) మధ్య 2004 సంవత్సరంలో టెస్ట్ సిరీస్ జరిగింది. అదికూడా పాకిస్తాన్ గడ్డపై ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఆ సమయంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొదటి టెస్ట్ ముల్తాన్ ( Multan Cricket Stadium) వేదికగా నిర్వహించారు. ఇందులో వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్ రెచ్చిపోయాడు. 375 బంతుల్లో ఏకంగా 309 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో 39 బౌండరీలు అలాగే 6 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ లో 95 పరుగుల వద్ద భారీ సిక్సర్ కొట్టాడు వీరేంద్ర సెహ్వాగ్.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?
అలాగే 195 పరుగులు, 295 పరుగుల వద్ద కూడా సిక్సర్ కొట్టి ట్రిపుల్ సెంచరీ చేసుకున్నాడు. ఇలా సిక్సర్లు కొడతానని ముందే చెప్పి మరి వీరేంద్ర సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ చేశాడట. ఈ విషయాన్ని ఇటీవల కాలంలో సౌరవ్ గంగూలీ వెల్లడించారు. అయితే ఇవాళ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టిన రోజు ( virender sehwag birthday ) ఉన్న నేపథ్యంలో ఈ విషయం మరోసారి వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఈ టెస్టులో పాకిస్తాన్ పైన 52 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఐదు వికెట్లు కోల్పోయి 675 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొదటి ఇన్నింగ్స్ లో 47 పరుగులకు ఆల్ అవుట్ అయిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ లో 216 పరుగులకు కుప్ప కూలింది.