BigTV English

Bigg Boss 9 Telugu : తెలుగు బిగ్ బాస్ బ్యాన్… నాగార్జునకు ఏం అయింది ?

Bigg Boss 9 Telugu : తెలుగు బిగ్ బాస్ బ్యాన్… నాగార్జునకు ఏం అయింది ?
Advertisement

Bigg Boss 9Telugu: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమం పట్ల గత కొద్దిరోజులుగా పూర్తిస్థాయిలో వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. గత సీజన్లలోనే బిగ్ బాస్ కార్యక్రమాన్ని నిషేధించాలి అంటూ పలువురు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ప్రసారమవుతున్న సీజన్ 9 కార్యక్రమాన్ని కూడా బ్యాన్ చేయాలి అంటూ కొంతమంది నాలుగు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫిర్యాదు చేసినప్పటికీ ఈ కార్యక్రమంపై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదన్న ఉద్దేశంతో ఫిర్యాదుదారులు నేడు హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో వీసీ సజ్జానార్ ను కలిసి మరోసారి ఈ కార్యక్రమం పై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది.


సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు?

జూబ్లీహిల్స్ లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. తాము త్వరలోనే సినిమాటోగ్రఫీ మంత్రిని కూడా కలవబోతున్నామని తెలిపారు. బిగ్ బాస్ కార్యక్రమం వల్ల సమాజానికి ఏ విధమైనటువంటి సమాచారాన్ని అందజేస్తున్నారని మండిపడ్డారు. బయట సమాజంలో ఎంతో నెగిటివిటీ ఎదుర్కొన్న వారిని తీసుకెళ్లి బిగ్ బాస్ హౌస్ లో పెట్టారు. ముఖ్యంగా వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఈ కార్యక్రమం మరింత దారుణంగా మారిపోయిందని తెలిపారు.

నాగార్జునకు ఏమైంది?

బయట బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిని, ఇతర ఫ్యామిలీలను ఇబ్బంది పెట్టిన వారిని హౌస్ లోకి పంపించి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బిగ్ బాస్ కార్యక్రమం పై చర్యలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరారు. ఇక నాగార్జున (Nagarjuna) గురించి కూడా ఫిర్యాదుదారులు మాట్లాడుతూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నాగార్జునకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అందరూ కింగ్ అని పిలుస్తారు. అలాంటి వ్యక్తి సమాజంలో మంచి పేరు లేని వ్యక్తిని హౌస్ లోకి పిలిచి, ఆవిడకు సపొర్ట్ గా నిలిస్తూ, ఆమె చేసింది కరెక్ట్ అంటూ చెబుతున్నాడు.


సమాజంలో హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న నాగార్జునకు ఈ కార్యక్రమం విషయంలో ఏం జరిగింది? అసలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అంటూ నాగార్జున తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇక ఈ కార్యక్రమం గురించి వరుసగా ఇలాంటి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలి అంటూ తాము పోరాటం చేస్తుంటే కొంతమంది మాకు బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తున్నారని ఫిర్యాదుదారులు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఈ షోపట్ల ఇలాంటి ఫిర్యాదులు వస్తున్న ఎక్కడ కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కానీ నాగార్జున కానీ స్పందించలేదు.

Also Read: Sujeeth: నిర్మాత దానయ్యతో గొడవలు.. మొత్తానికి నోరువిప్పిన డైరెక్టర్ సుజిత్!

Related News

Bigg Boss 9 Promo: నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు.. పోవమ్మా.. మాధురికి తనూజ స్ట్రాంగ్ కౌంటర్

Emmanuel vs Thanuja: ఇది సార్ మీ అసలు రంగు.. ఇప్పటివరకు మీరు చేసిందంతా నాటకం

Bigg Boss 9 Nomination List: ఆయేషా సేవ్.. నామినేషన్ లో మొత్తం 8 మంది.. ఎవరెవరు ఉన్నారంటే..

Bigg Boss 9: నామినేషన్స్ రచ్చ.. రీతూకి రాము కౌంటర్, ఇమ్మాన్యుయేల్ కి గట్టి షాక్

Emmanuel On Kalyan: కళ్యాణ్ ని నమ్మి మోసపోయిన ఇమ్మాన్యుయేల్.. నామినేషన్ లో వెన్నుపోటు

Ayesha On Rithu : రీతూని ఓర్వలేకపోతున్న ఆయేషా.. పర్సనల్ రీవెంజ్ ఏమైనా ఉందా?

Moksha Ramya On Thanuja : వామ్మో జుట్లు పట్టుకునే స్టేజ్ కు వెళ్ళిపోతున్నారు, పచ్చళ్ళ పాప ఘాటు కౌంటర్స్ 

Big Stories

×