E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

‘ఒరేయ్’ వైభవ్ అంటూ రెచ్చిపోయిన తెలుగు అభిమాని..ఇంగ్లండ్ లోనూ ప‌రువు తీశారు!

‘ఒరేయ్’ వైభవ్ అంటూ రెచ్చిపోయిన తెలుగు అభిమాని..ఇంగ్లండ్ లోనూ ప‌రువు తీశారు!
Advertisement

Trolls On Vaibhav:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Team India) మధ్య నిన్న టి20 (India tour of England, 2026 ) జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ చేయగా… ఇంగ్లాండు సెకండ్ బ్యాటింగ్ చేసే సమయానికి భారీ వర్షం పడింది. ఈ క్రమంలో మొదటి టి20 రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ సందర్భంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi ) అంతర్జాతీయ అరంగేట్రం చేస్తారని, పెద్ద చర్చ జరిగింది. కానీ చివరి క్షణంలో వైభవ్ కు మరోసారి నిరాశ ఎదురయింది. ఈ నేపథ్యంలో వైభవ్ వాటర్ బాయ్ గా నిన్నటి మ్యాచ్ సందర్భంగా కనిపించారు. ఈ త‌రుణంలోనే ‘ఒరేయ్ వైభవ్.. ఒక్కసారి చూడరా’ 15 ఏళ్ల బుడ్డోడిని ఓ తెలుగు ఫ్యాన్ అవమానించారు. ఈ సంఘ‌ట‌నకు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

Also Read:  Tamim Iqbal Trolls Team India Tamim Iqbal: ఐపీఎల్ లో ఆడ‌టం త‌ప్ప‌ టీమిండియా ప్లేయ‌ర్ల‌కు ఎక్క‌డా చేత‌కాదు

‘ఒరేయ్ వైభవ్.. ఒక్కసారి చూడరా’ అంటూ అవమానించిన ఫ్యాన్స్‌

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Team India) మధ్య నిన్న తొలి టి20 జరిగింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్య‌వంశీ అరంగేట్రం చేస్తాడని అనుకుంటే… మరోసారి టీమిండియా యాజమాన్యం అతడికి షాక్ ఇచ్చింది. ఐర్లాండ్ తో ఆడిన జట్టునే బరిలోకి దింపింది టీమిండియా. అయితే నిన్నటి మ్యాచ్ సందర్భంగా రవి బిస్నోయ్ తో కలిసి వైభవ్ సూర్యవంశీ వాటర్ బాయ్ గా కనిపించాడు. నిన్నటి మ్యాచ్ నేపథ్యంలో ప్లేయర్లు అంద‌రికీ వాటర్ సప్లై చేశాడు. ఈ క్రమంలో స్టేడియం బౌండరీ గేట్ నుంచి వైభవ్ వెళుతుండగా.. అతడిని గట్టిగా పిలుస్తూ తెలుగు అభిమాని అవమానించాడు. మొదట వైభవ్ అంటూ మర్యాదగా పిలిచిన సదరు అభిమాని… ఆ తర్వాత ఒరేయ్ వైభవ్ ఒకసారి చూడరా అంటూ రెచ్చిపోయాడు. అయినప్పటికీ వైభవ్ ఆలకించలేదు.

అసలు పట్టనట్టుగా వైభవ్ వ్యవహరించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ అంటే ఎవడికి మర్యాద లేదని.. ఇష్టం వచ్చినట్లు అతడిని పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన తెలుగోళ్లే… ఇలా వ్యవహరించడం దారుణం అంటూ మండిపడుతున్నారు. 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ దాకా వెళ్లిన వైభవ్ ను మర్యాదగా పిలవాలని కోరుతున్నారు. అనవసరంగా వైభవ్ ను బండ బూతులు తిట్టి వైరల్ కావద్దని ఆగ్రహిస్తున్నారు. అతడికి క్షమాపణలు చెప్పాల్సిందేనని సదరు తెలుగు అభిమాని పై ఫైర్ అవుతున్నారు. అయితే ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో.. వైభవ్ ను ఒరేయ్ అని పిలిచిన తెలుగు అభిమాని… క్షమాపణలు కూడా చెప్పాడట. వైభవ్ అంటే తనకు గౌరవం అని.. ఇకపై అతడిని మర్యాదగానే పిలుస్తానని స్పష్టం చేశాడట. దీంతో ఈ సంఘటన వైరల్ గా మారింది.

Advertisement

 

Also Read: Mike Hesson on Pakistan not winning the ICC events: పాకిస్తాన్ సక్సెస్ రేట్ 70 శాతానికి పెరిగింది..ఇక టీమిండియా చిత్తుగా ఓడిస్తాం

 

Related News

ఇంగ్లండ్ మ్యాచ్ లో క్షుద్ర పూజ‌లు..అభిషేక్ శ‌ర్మ వ్య‌వ‌హారంపై అనుమానాలు!

నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..డ్రెస్సింగ్ రూంలో వైభ‌వ్ రెడీగా ఉన్నాడు

ఇషాన్ కిష‌న్ కు అభిషేక్ వెన్నుపోటు..మైదానంలోనే గొడ‌వ‌కు దిగిన ప్లేయ‌ర్లు !

ఇంగ్లండ్ సిరీస్ లో న‌న్ను స‌రిగ్గా వాడుకోలేదు..బౌలింగ్ కూడా ఇవ్వ‌లేదు

టీమిండియాను దెబ్బ‌కొట్టిన‌ జై మూండ్రాకు పాకిస్తాన్ బంప‌ర్ ఆఫ‌ర్‌

Daryll Cullinan: టీమిండియాలో ఆడ‌టం నీ వ‌ల్ల కాదు..వెళ్లి గ‌ల్లీ క్రికెట్ ఆడుకో

వైభ‌వ్ బాగా ఆడ‌తాడ‌ని టీమిండియా ప్లేయ‌ర్లే అరంగేట్రం ఆపుతున్నారు

Big Stories

×