E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

యుద్ధం ఆగింది.. తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్‌ ధరలు పీక్స్ చేరాయి, చికెన్‌ కిలో రూ.330-గుడ్డు ధర రూ.8

యుద్ధం ఆగింది.. తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్‌ ధరలు పీక్స్ చేరాయి,  చికెన్‌ కిలో రూ.330-గుడ్డు ధర రూ.8
Advertisement

Chicken-Egg Prices:  తెలుగు రాష్ట్రాల్లో నాన్‌వెజ్ ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా చికెన్‌, కోడి గుడ్ల ధరల అమాంతంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో చికెన్‌ రూ.330 పలుకుతోంది. ఇక గుడ్డు ధర చెప్పనక్కర్లేదు, ఒకొక్కటి రూ.8 కు చేరింది. ఉన్నట్లుండి ధరల పెరుగుదలకు కారణమేంటి? ఇంకా పెరగడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పీక్స్ కు చేరిన నాన్ వెజ్‌ ధరలు 

Advertisement

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి ఫుల్‌స్టాప్ పడింది. ఫలితంగా నాన్‌వెజ్ మళ్లీ పెరిగాయి. గతంలో గల్ఫ్‌కు పంపించాల్సిన నాన్‌‌వెజ్, గుడ్లు ఎగమతి కాలేదు. ఫలితంగా ధరలు దిగొచ్చాయి. ప్రస్తుతం ఎగుమతులు-దిగుమతులకు ఎలాంటి అంతరాయం లేకపోవడంతో ధరలు జోరందుకున్నాయి. మార్చిలో చికెన్‌, కోడి గుడ్లు సామాన్యులకు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు జేబుకు చిల్లుపడుతోంది.

ఒక్కసారిగా ధరల పెరుగుతుండడంతో మధ్యతరగతి- నాన్‌వెజ్‌ ప్రియులు కాసింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్‌లో వాటి ధరల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ధరలు ఏ రేంజ్‌‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గత వారం కిలో స్కిన్‌ లెస్‌ చికెన్‌ రూ.280 నుంచి రూ.300 మధ్య పలికేది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో రూ.300 నుంచి రూ.330 వరకు ధర పలుకుతోంది.

Advertisement

చికెన్‌ కిలో రూ.330.. గుడ్డు ధర ఒకొక్కటి రూ.8

ఇక విజయవాడ మార్కెట్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడా కిలో చికెన్‌ రూ.320 నుంచి రూ.330 వరకు అమ్ముడుపోతోంది. రిటైల్‌ దుకాణాల్లో ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నట్లు సగటు వినియోగదారుడు చెబుతున్నమాట. కేవలం చికెన్‌ మాత్రమే కాదు దాని ధర ప్రభావం కోడి గుడ్లపై పడింది. నెల లేదా రెండు నెలల కిందట వరకు ఒక్కో గుడ్డు రూ. 4-6 మధ్య పలికేది. చిల్లరగా ఒక్కో గుడ్డు రూ.8కు చేరింది.

ఒక ట్రే గుడ్ల కొనాలంటే ప్రాంతాల బట్టి దాదాపు రూ.240 పైగానే పలుకుతోంది. ప్రొటీన్‌ కోసం గుడ్లపై ఆధారపడే కుటుంబాలకు భారంగా మారింది. అమాంతంగా నాన్‌వెజ్ ధరల పెరుగుదలకు కారణాలు లేకపోలేదు. ఎండల వల్ల పౌల్ట్రీలో కోళ్ల మరణాలు పెరిగతాయి. దానివల్ల ఉత్పత్తి అమాంతంగా తగ్గిందని చెబుతున్నారు.

ALSO READ: హైదరాబాద్‌లో దారుణం.. మేకకు ఎద్దు మాంసం, హెచ్-ఫాస్ట్ బృందం తనిఖీల్లో షాకింగ్ విషయాలు

వాటికి వేసే ఆహారం మొక్కజొన్న, సోయాబీన్‌ ధరలు పెరగడంతో నిర్వహణ వ్యయం పెరిగిందని చెబుతున్నారు. ఫలితంగా చాలామంది కోళ్ల పెంపకాన్ని తగ్గించినట్లు చెబుతున్నారు వ్యాపారులు. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌ కావడంతో డిమాండ్‌ భారీగా పెరిగిందని చెబుతున్నారు. సరఫరా తగ్గడంతో డిమాండ్‌ పెరిగిందని అంటున్నారు. మరి ఈ ధరలు ఎప్పటికి దిగొస్తుందో చూడాలి.

Related News

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. నకిలీ వీసాలతో 20 మంది మహిళలు అరెస్ట్!

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

హైదరాబాద్‌లో దారుణం.. మేకకు ఎద్దు మాంసం, హెచ్-ఫాస్ట్ బృందం తనిఖీల్లో షాకింగ్ విషయాలు

వాతావరణ శాఖ చల్లని కబురు.. వారం రోజుల పాటు దంచికొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్!

తెలంగాణలో నేడు కాలేజీల బంద్.. ప్రైవేట్ యాజమాన్యాల సంచలన నిర్ణయం.. కారణం ఇదే!

ICT Instructors: మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ..!

బీఆర్‌ఎస్‌కు కొత్త పేరు పెట్టిన మంత్రి పొంగులేటి.. ఏంటో తెలుసా?

Big Stories

×