E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!
Advertisement

Telangana politics: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో గులాబీ, హస్తం పార్టీల మధ్య మొదలైన రాజకీయ పోరు.. చివరకు నేతల అరెస్టులు, తోపులాటలతో రోడ్డుపైకి చేరింది. గత ప్రభుత్వ అప్పులు, గురుకులాల్లో అవినీతిపై చర్చకు రావాలంటూ ఇరుపక్షాలు విసిరిన సవాళ్లు.. హైదరాబాద్ నడిబొడ్డున హైడ్రామాకు దారితీశాయి.

సవాల్ జూపల్లిది.. సై అన్న బీఆర్ఎస్!
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు లెక్కలతో సహా వస్తానని సవాల్ విసరడమే ఈ వివాదానికి ఆజ్యం పోసింది. ఈ సవాల్‌ను స్వీకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. మంత్రి జూపల్లితో చర్చ కోసం కేటీఆర్ నేతృత్వంలోని ఒక బృందం తెలంగాణ భవన్‌లోనే వేచి ఉండగా.. గురుకులాల్లో అవినీతిపై మంత్రులతో చర్చించేందుకు హరీష్ రావు నేతృత్వంలోని మరో బృందం అమరవీరుల స్తూపం వద్దకు బయల్దేరింది.

Advertisement

రోడ్డుపై తోపులాట.. కిందపడ్డ హరీష్ రావు
అమరవీరుల స్తూపం వైపు వెళ్తున్న హరీష్ రావు బృందాన్ని పోలీసులు తెలంగాణ భవన్ వద్దే భారీగా మోహరించి అడ్డుకున్నారు. వాహనాలకు అనుమతి నిరాకరించడంతో, హరీష్ రావు కాలినడకన ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపులాటలో హరీష్ రావు అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీగా నినాదాలు చేశారు.

సవాల్ చేసి అడ్డుకుంటారా?
అయితే తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకే కాంగ్రెస్ మంత్రులు పోలీసులను ముందుపెట్టి రాజకీయం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. “సవాల్ చేసింది మీరే.. ఇప్పుడు భయపడి అడ్డుకుంటోంది మీరే” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చర్చకు రమ్మని పిలిచి, తీరా వస్తుంటే పోలీసులతో అరెస్టులు చేయించడం ఏంటని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఈ హైడ్రామాతో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో ఈ అప్పులు-అవినీతి రచ్చ మరింత ముదిరింది.

Advertisement

Also Read: ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణాలు చేతబట్టుకుని పరుగులు తీస్తున్న ప్రజలు

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

×