E-Paper
Advertisement

Temba Bavuma: CSKలోకి మ‌ర‌గుజ్జు.. ధోని అదిరిపోయే ప్లాన్ ?

Temba Bavuma: CSKలోకి మ‌ర‌గుజ్జు.. ధోని అదిరిపోయే ప్లాన్ ?
Advertisement

Temba Bavuma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ గత 16 సీజన్లలో మొదటిసారిగా అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ గురించి ఊహగణాలు పెరిగాయి. అయితే ఈ అనుమానాలను చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ పూర్తిగా కొట్టి పారేశారు. ఐపీఎల్ 2026 సీజన్ కి ముందు ధోని రిటైర్ కావడం లేదని స్పష్టం చేశారు. ఇక ఐపీఎల్ 2006 గురించి గతంలోనే ధోని మాట్లాడుతూ.. “రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడానికి నాకు మరో నాలుగు, ఐదు నెలల సమయం ఉంది. ఇప్పుడే తొందర పడాల్సిన అవసరం లేదు” అని స్పష్టం చేశాడు.

Also Read: India A vs Oman A: ఏంట్రా దీని ఓవరాక్షన్.. టీమిండియా ప్లేయర్ కే బౌలింగ్ వేస్తోంది

Advertisement

ఇక రాజస్థాన్ రాయల్స్ కీలక ఆటగాడు సంజు శాంసన్ ట్రాన్స్ఫర్ డీల్ లో చెన్నై సూపర్ కింగ్స్ లో చేరాడు. ఈ క్రమంలో జట్టు కీపింగ్ బాధ్యతలను అతడికి అప్పగించి, ధోని తన పని భారాన్ని తగ్గించుకొని.. రాబోయే సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ని విజేతగా నిలిపేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాడు. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ లో చేరినప్పటి నుండి ఆ జట్టును ఐదుసార్లు టైటిల్స్ కి నడిపించిన ధోని.. 2026 ఐపీఎల్ లో మరోసారి విజేతగా నిలిపి ఇక ఐపీఎల్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నాడట.

ధోని అదిరిపోయే ప్లాన్:

2026 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ని మరోసారి విజేతగా నిలిపేందుకు మహేంద్ర సింగ్ ధోని ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. అదేంటంటే సౌత్ ఆఫ్రికా టెస్ట్ కెప్టెన్ టెంబా బవుమా.. ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ లో భాగం కానున్నట్లు ఈ వార్త వైరల్ అవుతుంది. టెంబా బవుమా ఇప్పటివరకు ఐపీఎల్ లో పాల్గొనలేదు. అయితే ఈ సీజన్ లో ఇతడు చెన్నై సూపర్ కింగ్స్ లో భాగం కానున్నాడనే వార్త వైరల్ గా మారింది. కానీ ఇందులో వాస్తవం లేదు. ఎందుకంటే బవుమా ఒక టెస్ట్ ప్లేయర్. అందువల్ల ఇతడి పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించదు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో క్రీడాభిమానులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ బవుమా చెన్నై తరపున ఆడితే.. ఎగిరి ఎగిరి సిక్స్ లు కొడతాడని ఓ అభిమాని కామెంట్ చేస్తే.. ఇతడికి ఐపీఎల్ లో ఎవరూ చాన్సులు ఇవ్వరు అని.. కానీ అవకాశం వస్తే బాగానే ఆడతాడనిపిస్తుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

 

టెస్టుల్లో బవుమా విజయాల పరంపర:

టెస్టుల్లో బవుమా తన విజయాల పరంపరను కొనసాగిస్తున్నాడు. తాజాగా భారత్ గడ్డపై భారత్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లోని తొలి టెస్ట్ ని కైవసం చేసుకుని.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. భారత్ పై, భారత్ లో 15 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికాను ఒక టెస్ట్ మ్యాచ్ గెలిపించడమే కాక.. మరో గొప్ప రికార్డు ని సృష్టించాడు.

Also Read: Sanju-CSK: ధోని గుర్తులు చెరిపేస్తోన్న సంజు… చెన్నైలో అతిపెద్ద క‌టౌట్ల‌తో స‌రికొత్త రికార్డ్‌

టెస్ట్ క్రికెట్ హిస్టరీ లోనే 148 సంవత్సరాలలో ఎవరికి సాధ్యం కానీ రికార్డ్ ని సాధించాడు బవుమా. కెప్టెన్ గా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అత్యంత వేగంగా 10 టెస్ట్ విజయాలు సాధించిన తొలి కెప్టెన్ గా బవుమా అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు 11 టెస్ట్ మ్యాచ్ లకి కెప్టెన్ గా వ్యవహరించిన బవుమా.. పది మ్యాచ్ లని గెలిపించాడు. ఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది. అతని టెస్ట్ కెరీర్ లో కెప్టెన్ గా ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా లేకపోవడం గమనార్హం.

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×