E-Paper
Advertisement

Flight Operations Close: అలర్ట్.. రేపు ఈ విమానాశ్రయంలో 6 గంటల సేపు విమాన సేవలు బంద్, వెంటనే చెక్ చేసుకోండి!

Flight Operations Close: అలర్ట్.. రేపు ఈ విమానాశ్రయంలో 6 గంటల సేపు విమాన సేవలు బంద్, వెంటనే చెక్ చేసుకోండి!
Advertisement

Mumbai Airport Close: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 6 గంటల పాటు మూత పడనుంది. నవంబర్ 20(గురువారం)న ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు అన్ని రన్‌ వే కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (MIAL) అధికారికంగా ప్రకటించింది.  ప్రపంచ విమానయాన ప్రమాణాలకు అనుగుణంగా సేఫ్టీ, రిలయబులిటీ పెంచే చర్యల్లో భాగంగా షెడ్యూల్ చేసిన రన్ వేలను క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు.

ముంబై విమానాశ్రయంలో రెండు రన్ వేలు

ముంబై విమానాశ్రయంలో రెండు రన్‌ వేలు ఉన్నాయి. మెయిన్ రన్‌ వే 9/27, సెకెండరీ రన్‌ వే 14/32.  ఇవి రోజుకు 950 విమాన రాకపోకలను నిర్వహిస్తాయి. ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత రెండవ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. విమానయాన సంస్థలు, ఇతర స్టాక్ హోల్డర్లు విమాన షెడ్యూల్‌ లను, మ్యాన్ పవర్ ప్లాన్స్ ను బంద్ కు అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు వీలుగా ఎయిర్‌ మెన్‌ కు ముందుగానే నోటీసు జారీ అయ్యింది. కమ్యూనికేషన్ కార్యకలాపాలలో మరింత సజావుగా సమన్వయం చేసుకోవడం, ప్రయాణీకుల అసౌకర్యాన్ని తగ్గించేలా చర్యలు చేపడుతున్నట్లు MIAL తెలిపింది.

ఇంతకీ ఏంటీ NOTAM?

Advertisement

సాధారణంగా  NOTAM అనేది విమాన కార్యకలాపాలలో పాల్గొనే సిబ్బందికి అవసరమైన సమాచారాన్ని అందించే నోటీసు. మెయింటెనెన్స్ లో భాగంగా తనిఖీలు, మరమ్మతులు, రన్‌ వే లైటింగ్,  సిగ్నల్స్, డ్రైనేజీ వ్యవస్థల సాంకేతిక అంచనాలు ఇందులో రాసి ఉంటాయి.  ఇందుకు అనుగుణంగా ఆయా విమానయాన సంస్థలు ప్రయాణీకులకు సమాచారం అందిస్తాయి.

https://twitter.com/CSMIA_Official/status/1990748259900608843

Advertisement

Read Also: గాల్లో ఉండగా.. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో సాంకేతిక లోపం, 155 మంది ప్రయాణికులు సురక్షితం!

NMIAలో డిసెంబర్ 25 నుంచి కమర్షియల్ ఆపరేషన్స్

అటు నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) డిసెంబర్ 25 నుంచి వాణిజ్య విమాన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. తొలుత 23 షెడ్యూల్డ్ రోజువారీ రాకపోకలు ఉంటాయి. మొదటి నెలలో విమానాశ్రయం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటలు పని చేస్తుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో రెండవ ప్రధాన విమానాశ్రయం అయిన NMIAను అక్టోబర్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రారంభ దశలో, ఈ విమానాశ్రయం రోజుకు దాదాపు 120 విమాన రాకపోకలను నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 2026 నుంచి ఈ విమానాశ్రయం 24 గంటలూ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. NMIA మొదటి దశను రూ. 19,650 కోట్ల వ్యయంతో నిర్మించారు. 1,160 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ విమానాశ్రయం మొదటి దశలో ఒక టెర్మినల్, ఒక రన్‌వే ను కలిగి ఉంటుంది. ఏడాదికి ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యం 20 మిలియన్లు.

Read Also: బెంగళూరులో మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×