E-Paper
Advertisement

Childrens Death: తీవ్ర జ్వరంతో గంటల వ్యవధిలో.. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు చిన్నారులు మృతి

Childrens Death: తీవ్ర జ్వరంతో గంటల వ్యవధిలో.. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు చిన్నారులు మృతి
Advertisement

Childrens Death: ఉత్తరప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో గంటల వ్యలధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరుణంలో అధికారులు అప్రమత్తం అయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్రప్రదేశ్‌లోని గులార్హియా గ్రామంలో పింటు గౌర్ అనే వ్యక్తి కుమార్తె మంజు(7) వారం క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. స్థానిక వైద్యుని దగ్గర చికిత్స చేపించినప్పటికీ బాలిక కోలుకోలేదు. ఈ నేపథ్యంలో మరో ఆసుపత్రికి తరలించగా .. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ తర్వాత గంటకే గౌర్ చిన్న కుమార్తె ఖుషి(3), కుమారుడు కృష్ణ(5) జ్వరంతో ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా ముగ్గురు పిల్లలు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లల మృతికి కారణమైన వ్యాధి ఏమిటి? ఇది సాధారణ జ్వరమా? లేక ప్రాణాంతక వైరస్ వ్యాప్తి అవుతోందా? అనే అనుమానాలు గ్రామస్థులలో వ్యక్తమవుతున్నాయి.

Advertisement

వీరి మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. గ్రామంలో ఇతర పిల్లలకు కూడా జ్వరం లక్షణాలు కనిపిస్తాయన్న అనుమానంతో ఇంటింటా సర్వే చేపట్టారు.

వైద్యాధికారులు గ్రామస్థులకు పలు సూచనలు జారీ చేశారు. జ్వరం, వాంతులు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. స్వయం వైద్యానికి దూరంగా ఉండాలని, ఇంట్లోనే మందులు వేసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. అలాగే శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిల్వ నీరు లేకుండా చూసుకోవాలని చెప్పారు.

Advertisement

ఈ ఘటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వైద్య బృందాలను పంపి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అవసరమైతే ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రజల్లో భయాందోళనలు పెరగకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

Also Read: ఆటోని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో ఒకరు మృతి

ఆరోగ్య శాఖ బృందం ఇప్పటి వరకు గ్రామంలో 57 మంది పిల్లలకు మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైన వారికి మందులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×