E-Paper
Advertisement

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!
Advertisement

80s AI Trend: ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోన్న 80s ట్రెండ్‌లో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా వచ్చి చేరుతున్నారు. అయితే సరదాగా ప్రారంభమైన ఈ ట్రెండ్.. రాజకీయ పార్టీల ప్రవేశంతో పొలిటికల్ వార్ గా మారుతున్నాయి. దేశంలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య.. 80s కంటెంట్ వార్ మెుదలైంది. ఆనాటి చిత్రాలు, రెట్రో ఫొటోలను అడ్డుపెట్టుకొని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

తొలుత సరదా పోస్టులతో మెుదలై..

ఈ ఏఐ ట్రెండ్‌ను మొదటగా పాలిటిక్స్ లోకి తీసుకొచ్చింది కేంద్ర మంత్రులే. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పియూష్ గోయల్ వంటి అగ్రనేతలు తమ ఏఐ జనరేటెడ్ ’80s’ ఫోటోలను ఎక్స్ లో పంచుకున్నారు. ‘అందరూ 80ల నాటి రోజుల్లోకి వెళ్తున్నారు? నేను కూడా ఆ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళక తప్పలేదు’ అంటూ రిజిజు పోస్ట్ చేయగా పియూష్ గోయల్ కూడా ఈ ట్రెండ్‌ను ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సాధారణ పోస్టులతో మొదలైన సరదా వాతావరణం.. ఆ తర్వాత రాజకీయ విమర్శలకు వేదికగా మారింది.

బీజేపీపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రం!

Advertisement

కేంద్ర మంత్రుల పోస్టుల తర్వాత కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. కాంగ్రెస్ కేరళ యూనిట్ తమ అధికారిక ఖాతాలో ఒక ఏఐ ఫోటోను షేర్ చేసింది. అందులో మారుతి సుజుకి ఒమ్ని (Omni) కారులో ముందరి సీట్లో గుండుతో ఉన్న తెలుగు విలన్ రామిరెడ్డిని చూపించారు. ’80లలో ఒక గుజరాత్ వీధి’ అంటూ దానికి క్యాప్షన్ జోడించారు. ఇక ఈ ఫోటోలో వెనుక ఉన్న ఒక పోస్టర్‌పై ‘దయచేసి నవ్వండి. మీరు ఢిల్లీలో ఉన్నారు’ అని హిందీలో రాసి ఉంది. దీంతో ఇది బీజేపీకి చెందిన ఓ అగ్రనేతను టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్ట్ గా నెట్టింట చర్చ మెుదలైంది.

కౌంటర్ ఇచ్చిన బీజేపీ

Advertisement

కాంగ్రెస్ చేసిన విమర్శకు తెలంగాణ బీజేపీ యూనిట్ అంతే తీవ్రంగా కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ పోస్ట్‌ను రీపోస్ట్ చేస్తూ బీజేపీ ఒక ఏఐ ఫోటోను షేర్ చేసింది. అందులో 1970ల కాలం నాటి పబ్‌లో డ్రింక్స్ సీసాల ముందు ఒక మహిళ టేబుల్‌పై డాన్స్ చేస్తున్నట్లు, కొంతమంది చూస్తున్నట్లు ఉంది. దానికి ‘Lusiana, Italy.. Circa-1970’s’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ లో ఎవరి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మస్థలమైన ఇటలీలోని పట్టణాన్ని ఇందులో ప్రస్తావించడం దుమారానికి కారణమైంది. ప్రత్యర్థుల వ్యక్తిగత అంశాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఏఐ సాంకేతికతను పొలిటికల్ పార్టీలు ఎంతలా వాడుకుంటున్నాయో చెప్పేందుకు ఈ ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

Also Read: ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

నెట్టింట ఏఐ పొలిటికల్ వార్

సాధారణంగా కలర్ ఫిల్టర్లు కేవలం ఫోటో రంగును మాత్రమే మారుస్తాయి. కానీ చాట్‌జీపీటీ వంటి ఆధునిక ఏఐ టూల్స్, మనుషుల ముఖ కవళికలను, హెయిర్ స్టైల్స్, వెనుక ఉన్న వాతావరణాన్ని పూర్తిగా అప్పటి కాలానికి తగ్గట్టుగా మార్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే సాంకేతికతను ఇప్పుడు రాజకీయ పార్టీలు ఒకరినొకరు డిజిటల్ రూపంలో దెబ్బతీసుకోవడానికి వాడుకుంటున్నాయి. భావప్రకటనా స్వేచ్ఛ ముసుగులో ఏఐ క్రియేటివిటీని రాజకీయ అస్త్రంగా మార్చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం నడుస్తోన్న ’80s ఏఐ ట్రెండ్’  సోషల్ మీడియాలో కొత్త రకం పొలిటికల్ వివాదాలకు దారితీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితం.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్!

Tags

Related News

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

ఎస్‌బిఐ స్పెషల్ ఆఫీసర్ జాబ్స్.. వార్షిక వేతం రూ.97 లక్షలు

వందేమాతరంపై మరో వివాదం.. ఈసారి మిత్రపక్షంతో కాంగ్రెస్‌కు పేచి.. విరుచుకుపడ్డ బీజేపీ!

Big Stories

Advertisement
×