Sanju Samson: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో టీమిండియా సెమీ ఫైనల్ కు దూసుకువెళ్లింది. అందరూ ఊహించినట్లుగానే వెస్టిండీస్ పైన విజయం సాధించి, సెమీ ఫైనల్ బరిలో అడుగు పెట్టింది టీం ఇండియా. వెస్టిండీస్ పై ఏకంగా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమ్ ఇండియా… సెమిస్ బెర్త్ ఖరారు చేసుకుంది. సంజు శాంసన్ ( Sanju Samson ) 97 పరుగులతో రాణించిన నేపథ్యంలో ఈ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది టీమిండియా. ఈ దెబ్బకు వెస్టిండీస్ ఇంటి దారి పట్టింది. ఇక మార్చి 5వ తేదీన ముంబై వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs West Indies ) మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో సంజు శాంసన్ అదరగొట్టాడు. వెస్టిండీస్ విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అద్భుతంగా రాణించాడు సంజు. ప్రతి మ్యాచ్ లో విఫలమైన సంజు శాంసన్.. ఇందులో మాత్రం 97 పరుగులు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా నాలుగు సిక్సర్లు అలాగే 12 బౌండరీలు సాధించాడు సంజు. చివరికి బౌండరీ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. అయితే మ్యాచ్ గెలిపించిన సంజు, తన ఆరాధ్య దైవం జీసస్ ను ( Jesus) ప్రార్థించాడు. అది జీసస్ బలంతోనే టీమిండియాను గెలిపించాను అన్న రేంజ్ లో గ్రౌండ్ లోనే ప్రార్థనలు చేశాడు. ఇప్పుడు ఇదే అంశం వివాదంగా మారింది. సంజు శాంసన్ అలా జీసస్ ను ప్రార్ధించడం పైన హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి.
అటు నెటిజెన్స్ కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రైస్తవ మతస్తులను టీం ఇండియా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues) కూడా టీమ్ ఇండియన్ గెలిపించి, జీసస్ ను ప్రార్థించింది. దీంతో ఆమెపై అప్పట్లో దారుణంగా ట్రోలింగ్ జరిగింది. 2025 వన్డే వరల్డ్ కప్ మహిళల టోర్నమెంట్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక ఇప్పుడు పురుషుల టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా సంజు శాంసన్ కూడా అలాగే వివాదంలో చిక్కుకున్నాడు. దీంతో సంజు శాంసన్ ను టీమిండియా లోంచి తొలగించాలని కొంత మంది అజ్ఞానులు డిమాండ్ చేస్తున్నారు. క్రైస్తవ మతం వాళ్లు జట్టులో ఉండకూడదని అంటున్నారు. వెంటనే ఇండియన్ అభిమానులకు సంజు శాంసన్ క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా, ఇప్పటి వరకు ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సెమీస్ కు వెళ్లాయి. తాజాగా టీమిండియా సెమీస్ లో అడుగు పెట్టింది.
GOD IS REAL , THIS IS SANJU SAMSON. pic.twitter.com/XW8uPFFrbD
— Cricket Central (@CricketCentrl) March 1, 2026