Trolls On Steve Smith fitness: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు ( Indian Premier League 2026 Tournament) పోటీగా ప్రారంభమైన పాకిస్తాన్ సూపర్ లీగ్ (Pakistan Super League) చివరి దశకు వచ్చేసింది. మరో రెండు మ్యాచ్ లు ఫినిష్ అయితే, టోర్నమెంట్ కూడా ముగుస్తుంది. అయితే ఇప్పటికే ఎలిమినేటర్ వన్ మ్యాచ్ ఫినిష్ కాగా, ఎలిమినేటర్ 2 రేపు జరగనుంది. మే మూడవ తేదీన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటుపై దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ( Steve Smith) గాయం అయినట్లుగా నడుస్తున్న వీడియో వైరల్ గా మారింది.
దీంతో ఫిట్నెస్ లేని ప్లేయర్లను కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడిస్తున్నారని పరువు తీస్తున్నారు కొంతమంది. ఫిట్నెస్ లేని ప్లేయర్లు, ఐపీఎల్ లో అమ్ముడుపోని ఆటగాళ్లు, రిటైర్మెంట్ ఇచ్చిన ప్లేయర్లకు పాకిస్తాన్ సూపర్ లీగ్ కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. స్టీవ్ స్మిత్ ఫిట్నెస్ గా లేడని చూపిస్తూ.. పాకిస్తాన్ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఎన్ని జన్మలు ఎత్తిన పోటీగా రాదని ఆడుకుంటున్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న ఎలిమినేటర్ వన్ మ్యాచ్ సందర్భంగా ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ ( Multan Sultans vs Hyderabad Kingsmen, Eliminator 1) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో హైదరాబాద్ ఎనిమిది వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్… 20 ఓవర్లలో 159 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలో ఫినిష్ చేసింది హైదరాబాద్. దీంతో ముల్తాన్ సుల్తాన్ జట్టుపై హైదరాబాద్ విక్టరీ అందుకుంది. అంతేకాదు ఎలిమినేటర్ 2 మ్యాచ్ కు కూడా ఎంపిక అయింది. ఇందులో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుతో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు మే మూడవ తేదీన పెషావర్ జల్మీ జట్టుతో ఫైనల్ ఆడనుంది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు తరుపున స్టీవ్ స్మిత్ ఆడుతున్నాడు. అయితే లేటెస్ట్ గా అతడు నడవలేని స్థితిలో కనిపించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో అతడు చాలా బలవంతంగా నడిచిన వీడియో వైరల్ గా మారింది. దీంతో స్టీవ్ స్మిత్ ఫిట్నెస్ తో లేడని… ఇలాంటి ప్లేయర్లను ఎందుకు తీసుకున్నారని పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇలాంటి వాళ్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందని సెటైర్లు పేల్చుతున్నారు. ఇలాంటి టోర్నమెంట్ ఐపిఎల్ కు ఏమాత్రం పోటీలు ఉండబోదని కుండ బద్దలు కొట్టి చెప్పారు.
Look at Steve Smith and just imagine the fitness standards in the PSL 😥
Many players there are either unsold in the IPL, retired from international cricket, or not at peak fitness.
Even their own players are not fit—so how can they expect better from overseas players? 🤣 pic.twitter.com/anw9YBAsGz
— Jara (@JARA_Memer) April 30, 2026