E-Paper
Advertisement

బీఆర్ఎస్‌లో ముగిసిన వారసత్వ పోరు.. ఇక అన్నీ రాము చూసుకుంటాడు: కేసీఆర్!

బీఆర్ఎస్‌లో ముగిసిన వారసత్వ పోరు.. ఇక అన్నీ రాము చూసుకుంటాడు: కేసీఆర్!
Advertisement

BRS Party: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ ఇక కేటీఆర్ చేతిలోకి రానుందనే ప్రచారం ఊపందుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ బాధ్యతలను ఇక కేటీఆర్ కు అప్పగించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని నిర్వహించిన పార్టీ సమావేశంలో ప్రతీసారి కేటీఆర్ పేరును ఉచ్చరించడం, గత రెండురోజులుగా పార్టీ నేతలతో భేటీలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తుండటంజరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చినట్లు అవుతుంది. త్వరలోనే పార్టీ పూర్తి బాధ్యతలు అప్పగించడం ఖాయమని పార్టీలోనే సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ కు తప్ప మరొకరికి అవకాశం లేదని హింట్ కూడా కేసీఆర్ ఇచ్చినట్లు సమాచారం.

కేటీఆర్ ఆధ్వర్యంలో..

పార్టీ పగ్గాలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈసారి బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తే అప్పగించేవారని సమాచారం. అయితే ఓటమిపాలు కావడంతో కేసీఆర్.. వెనుకంజ వేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా తెలంగాణ భవన్‌లో ఈనెల 27న పార్టీ రజోత్సవ వేడుకలు ముగింపు, పార్టీ ఆవిర్భావ వేడుకను పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలుమార్లు కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ తీరును ఎండగడుతున్న అంశాలను కేసీఆర్ ప్రస్తావించారు. పార్టీ సభ్యత్వం, కార్యక్రమాలు, సమావేశాలు అన్నీ రాము చేసుకుంటాడని.. నేతలు కోఆర్డినేషన్ చేసుకోవాలని సూచించారు. కేటీఆర్ రాజకీయపటిమపై కితాబు ఇచ్చినట్లు సమాచారం. అంటే పార్టీ వ్యవహారాలు అన్నీ కేటీఆర్ చూసుకుంటారని హింట్ ఇచ్చారు. పార్టీ మరొకరు లేరని.. ఆయనే పార్టీ పగ్గాలు అంటూ హింట్ సైతం ఇచ్చినట్లు అయింది.

వరంగ్‌కి వచ్చే నెలో..

Advertisement

గతరెండ్రోజులు కేటీఆర్ బీజీబీజీగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం వరంగల్ జిల్లా, హైదరాబాద్ జిల్లా నేతలతో భేటీలు నిర్వహించారు. సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, సర్ అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సూచనలు చేశారు. బుధవారం సైతం కల్వకుర్తి నేతల చేరికలతో పాటు సీనియర్ నేతలతో తెలంగాణ భవన్ లో భేటీ అయ్యారు. పలు అంశాలపై సూచనలు చేశారు. ఇది ఇలా ఉంటే వరంగల్ లో వచ్చే నెల 6న జిల్లా నేతలతో సమావేశం(సభ) నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకు ముందు కేటీఆర్, హరీష్ రావు లు ఇద్దరు సమావేశానికి హాజరు అవుతారని పార్టీ పేర్కొంది. అయితే ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు మాత్రం కేటీఆర్ ను ముఖ్య అతిధిగా హాజరుకావాలని ఆహ్వానించామని మీడియాకు తెలిపారు.

Also Read: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కీలక పదవి.. కేబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియామకం

వరంగల్ డిక్లరేషన్..

Advertisement

వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట నాలుగు సంవత్సరాల కిందట అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తన కపట మోసాన్ని కొనసాగిస్తున్నదని , స్వయంగా కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ రైతన్నలను మోసం చేసిన మే 6వ తేదీని పురస్కరించుకొని, కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు గుర్తు చేసేలా రైతన్నలతో ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. దీంతో పార్టీలో ఇక కేటీఆర్ ఒక్కరే అనే సందేశాన్ని పార్టీ ఇవ్వడంతోనే నేతలు ఇలా స్టేట్ మెంట్ ఇచ్చారనేది స్పష్టమవుతోంది.

కేటీఆర్ తర్వాత మరో నేత..?

మరోవైపు కవితసైతం కొత్త పార్టీ పెట్టడంతో ఇక ఆమెకు బీఆర్ఎస్ తో ఎలాంటి సంబంధం లేదు. ఇంతకు ముందు పార్టీబాధ్యతలు కేటీఆర్ కు అప్పగిస్తే కుటుంబంలో గొడవలకు ఆధ్యం పోసినట్లు అవుతుందని, అందుకే ఇప్పటివరకు గులాబీ అధినేత వేచి చూసినట్లు సమాచారం. ఇప్పుడు క్లీయర్ కావడంతోనే కేటీఆర్ ను యాక్టీవ్ చేసినట్లు ప్రచారం ఊపందుకుంది. పార్టీ సీనియర్లకు సైతం మొన్న నిర్వహించిన సమావేశంలోనే హింట్ ఇచ్చినట్లు సమాచారం. కేటీఆర్ తర్వాత మరో నేత లేరని.. అన్నీ ఆయనే చూసుకుంటారని చెప్పినట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికలతో వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతలను సైతం కేటీఆర్ నిర్వర్తించబోతున్నారు. పార్టీలో ఇక తీసుకోబోయే నిర్ణయాలన్నీ కేటీఆర్ ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.

Also Read: మైనర్ బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చట్టాలను సవరించాలని కేంద్రానికి సూచన

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×