E-Paper
Advertisement

U19 Asia Cup 2025 Final: చిత్తుగా ఓడిన టీమిండియా..ఆసియా క‌ప్ 2025 విజేత‌గా పాకిస్తాన్‌, ప్రైజ్ మనీ ఎంతంటే ?

U19 Asia Cup 2025 Final: చిత్తుగా ఓడిన టీమిండియా..ఆసియా క‌ప్ 2025 విజేత‌గా పాకిస్తాన్‌,  ప్రైజ్ మనీ ఎంతంటే ?
Advertisement

U19 Asia Cup 2025 Final: అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో  ( ACC Mens U19 Asia Cup 2025 ) టీమిండియా అండ‌ర్-19 జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా అట్టర్ ఫ్లాఫ్ అయింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ రెండు విభాగాల్లో దారుణంగా విఫలమైన టీమిండియా అండర్ 19 జట్టు ( India U19 Team ).. పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఛాంపియన్ జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. ఈ విజ‌యంతో టీమిండియా ప్ర‌తీకారం తీర్చుకుంది పాకిస్తాన్‌. ఈ అండర్ 19 ఆసియా కప్ 2025 ఫైన‌ల్స్ లో పాకిస్తాన్ విధించిన 347 ప‌రుగులు ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో 26.2 ఓవ‌ర్ల‌లోనే 156 ప‌రుగులు చేసి, ఆలౌట్ అయింది టీమిండియా అండ‌ర్ 19 టీం. టాప‌ర్డ‌ర్‌, మిడిల్‌, ఇటు టేయిలెండ‌ర్లు అంద‌రూ విఫ‌లం అయ్యారు. దీంతో 191 ప‌రుగుల భారీ తేడాతో పాకిస్తాన్ అండ‌ర్ 19 జ‌ట్టు (  Pakistan U19   ) చేతిలో ఓడింది టీమిండియా. దీంతో ఛాంపియ‌న్ గా నిలిచింది పాకిస్తాన్.

Also Read: Team India Squad: న్యూజిలాండ్ తో ఆడే టీం ఇండియా జట్టు ఇదే.. గిల్ పై వేటు, అక్షర్ పటేల్ కు బంపర్ ఆఫర్

ఆసియా క‌ప్ 2025 విజేత‌గా పాకిస్తాన్‌

Advertisement

ఆసియా కప్ 2025 అండర్ 19 టోర్నమెంట్ ఫైనల్ ఇవాళ జరిగిన సంగతి తెలిసిందే. దుబాయ్ లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ లో పాకిస్తాన్ అండర్ 19 వర్సెస్ టీమ్ ఇండియా అండర్ 19 జట్ల మధ్య ఈ ఫైట్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో టాస్ నెగ్గిన టీమిండియా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం చేస్తుంది. దీంతో మొదట పాకిస్తాన్ అండర్ 19 జట్టు బ్యాటింగ్ చేయడం జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏకంగా 8 వికెట్లు నష్టపోయి 347 వరకు భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అట్టర్ ఫ్లాప్ అయింది అండర్ 19 టీమిండియా.  26.2 ఓవ‌ర్ల‌లోనే 156 ప‌రుగులు చేసి, ఆలౌట్ అయింది టీమిండియా అండ‌ర్ 19 టీం.

ప్రైజ్ మనీ ఎంతంటే ?

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ అండర్ 19 ట్రోఫీ నేపథ్యంలో గెలిచిన పాకిస్తాన్ జట్టుకు ప్రైజ్ మనీ ఎంత వస్తుందని సోషల్ మీడియాలో అందరూ సెర్చ్ చేస్తున్నారు. అండర్ 19 టైటిల్ గెలిచిన జట్టుకు ప్రత్యేకంగా ACC నుంచి ఎలాంటి ప్రైజ్ మనీ రాబోదని తెలుస్తోంది. సీనియర్ జట్లు గెలిచినప్పుడు మాత్రం 2.6 కోట్లు ప్రైస్ మనీ అందించారు. మొన్న ఆసియా కప్ 2025 టి20 టోర్నమెంట్ లో సూర్య కుమార్ యాదవ్ సేనకు 2.6 కోట్ల ప్రైస్ మనీ వచ్చింది. అయితే అండర్ 19 ట్రోఫీ అందుకున్న పాకిస్తాన్ కు మాత్రం ప్రైజ్ మనీ రాబోదు అన్నమాట. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఏదైనా ప్రైజ్ మనీ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. కానీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి మాత్రం ట్రోఫీలు మాత్రమే అందిస్తారు. ఎలాంటి ప్రైజ్ మనీ ఇవ్వరు.

Advertisement

Also Read:  T20 World Cup 2026 India Squad: గిల్ పీడ విరగడైంది.. టి20 ప్రపంచ కప్ 2026 ఆడే టీమిండియా జట్టు ఇదే

 

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×