E-Paper
Advertisement

Burial Tradition: అర్ధరాత్రి లేచొచ్చి నృత్యం చేసే మృతదేహాలు.. ఆ పర్వతం మీదకు వెళ్లినవారి కథ కంచికే!

Burial Tradition: అర్ధరాత్రి లేచొచ్చి నృత్యం చేసే మృతదేహాలు.. ఆ పర్వతం మీదకు వెళ్లినవారి కథ కంచికే!
Advertisement

Burial Tradition: ఈ విశ్వం మనం ఇంకా పూర్తిగా చదవని పుస్తకం లాంటిది. అందుకే జీవితాన్ని ఎంత అర్థం చేసుకుంటే.. మరణం అంతే సహజంగా ఉంటుంది అంటుంటారు. శరీరం ముగిసినా ఆత్మ ప్రయాణం ఆగదని గీత కూడా చెబుతుంది. ఇకపోతే సాధారణంగా అంత్యక్రియలు అంటే.. పూడ్చిపెట్టడం లేదా దహనం చేయడం వరకు మాత్రమే అనుకుంటాం. కానీ కొన్ని దేశాల్లో మృతదేహాలను శవపేటికల్లో పెట్టి పర్వతాల మీద వేలాడదీసే ఆచారం కూడా ఉంది. మరో ఆశ్చర్యం ఏమిటంటే.. ఆ మృతదేహాలు సంవత్సరాల పాటు అలాగే ఉంటాయట. ఈ వింత సంప్రదాయం ఎక్కడ ఉంది? ఎందుకు అలా చేస్తారు.. వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పర్వతాలపై వేలాడే శవపేటికలు:

ప్రపంచంలో కొన్ని దేశాల్లో మృతదేహాలను శవపేటికలలో ఉంచి నేరుగా పర్వత శిఖరాలపై వేలాడదీసే ఆచారం ప్రాచీన కాలంలో ఉండేది. ప్రకృతి అందానికి పేరున్న ప్రాంతాల్లోనే ఇలాంటి భయంకరమైన సంప్రదాయాలు ఉండటం మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఇది ఒక్క దేశంలోనే కాదు.. ఏకంగా మూడు దేశాల్లో ఇలాంటి ఆచారాన్ని పాటిస్తారు.

ఆ మూడు దేశాల్లో ఆనవాళ్లు:

Advertisement

ఈ ‘హ్యాంగింగ్ కోఫిన్స్’ పద్ధతికి సంబంధించిన ఆధారాలు చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో లభించాయి. ముఖ్యంగా చైనాలో యాంగ్జీ నది పరిసర పర్వత ప్రాంతాల్లో వేల సంవత్సరాల కిందట వేలాడదీసిన శవపేటికలు ఇప్పటికీ కనిపిస్తాయి. వీటి చరిత్ర సుమారు 3,000 సంవత్సరాలకు పైగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అప్పట్లో ఈ శవపేటికలను చూసిన వారు భయంతో అక్కడికి వెళ్లడానికి కూడా సాహసించేవారు కాదు.

చెక్కుచెదరని మృతదేహాలు:

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. శవపేటికల్లో పెట్టి పర్వతాల మీద వేలాడదీసిన మృతదేహాలు చాలా కాలం పాటు భద్రంగా ఉండేవట. ప్రకృతి మధ్యలో వేలాడుతూ ఉన్నా, సంవత్సరాల తరబడి పెద్దగా హాని జరగలేదని చెబుతారు స్థానికులు.

అక్కడి ప్రజల నమ్మకం:

Advertisement

ఈ ఆచారం వెనుక ఓ బలమైన విశ్వాసం ఉంది. చైనాలోని కొన్ని పురాతన రాజవంశాలు ఈ పద్ధతిని అనుసరించాయని కథనాలు ఉన్నాయి. పర్వతాలకు దగ్గరగా ఉంచితే పూర్వీకులు ప్రకృతికి మరింత సమీపంగా ఉంటారని, ఆత్మకు స్వర్గ ద్వారాలు త్వరగా తెరుచుకుంటాయని వారు నమ్మేవారట.

అందుకే వేలాడదీస్తారు:

ఇలాంటి నమ్మకాలు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లలో కూడా ఉండేవి. అందుకే మృతదేహాన్ని మట్టిలో కాకుండా, ఎత్తైన ప్రదేశాల్లో వేలాడదీయడం పవిత్రమని భావించారు. అయితే, కాలక్రమంలో ఈ సంప్రదాయం పూర్తిగా కనుమరుగైంది.

అల్లుకున్న వింత కథలు:

ఈ వేలాడే శవపేటికల చుట్టూ ఎన్నో వింత కథలు ప్రచారంలో ఉన్నాయి. సాయంత్రం అయ్యాక ఆ ప్రాంతానికి ఎవ్వరూ వెళ్లరని, రాత్రిపూట అక్కడి నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు నమ్మేవారు. కొందరైతే.. అర్ధరాత్రి శవపేటికల నుంచి మృతదేహాలు బయటకు వచ్చి నృత్యం చేస్తాయని కూడా చెప్పేవారు. ఇవన్నీ నమ్మకాలే అయినా.. ఈ ఆచారం చుట్టూ ఏర్పడిన రహస్య వాతావరణం మాత్రం ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. మరణం ఒకటే అయినా, దాన్ని చూసే చూపు, గౌరవించే విధానం ప్రపంచవ్యాప్తంగా ఎంత భిన్నంగా ఉంటుందో ఈ కథలు చెప్పకనే చెబుతాయి.

 

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×