E-Paper
Advertisement

Elephant Attack: మన్యం జిల్లా రైతులను పరుగులు పెట్టించిన ఏనుగులు.. ఒక్కసారే పదుల సంఖ్యలో..

Elephant Attack: మన్యం జిల్లా రైతులను పరుగులు పెట్టించిన ఏనుగులు.. ఒక్కసారే పదుల సంఖ్యలో..
Advertisement

Elephant Attack: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న గజరాజులు..  తాజాగా శివన్నపేట, మాదలంగి గ్రామాల్లోని పంట పొలాలపై విరుచుకుపడ్డాయి. దీంతో పంటలను తొక్కి ధ్వంసం చేయడంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది.

ఏడాది పొడవునా కష్టపడి సాగు చేసిన పంటలు చేతికి వచ్చే సమయంలో ఏనుగుల దాడికి గురవ్వడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు’ అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని.. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

ఏనుగుల సంచారంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులను అప్రమత్తం చేస్తూ..  పొలాల వైపు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. టపాసులు పేలుస్తూ, డప్పు వాయిద్యాల సహాయంతో ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమికొట్టేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఏనుగులు గ్రామాల సమీపంలోనే తలదాచుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు.

ALSO READ: Vikarabad District: తాగిన మత్తులో డీసీఎం డ్రైవర్ బీభత్సం.. తృటిలో తప్పించుకున్న చిన్నారి, వీడియో వైరల్

Advertisement

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×