E-Paper
Advertisement

Ind vs SA 3rd T20I: టాస్ గెలిచిన‌ టీమిండియా, బుమ్రా ఔట్‌, భారీ మార్పుల‌తో బ‌రిలోకి సూర్య‌

Ind vs SA 3rd T20I:  టాస్ గెలిచిన‌ టీమిండియా, బుమ్రా ఔట్‌, భారీ మార్పుల‌తో బ‌రిలోకి సూర్య‌
Advertisement

Ind vs SA 3rd T20I: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా  మధ్య టి20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో భాగంగా మొదటి టి20 టీం ఇండియా గెలవగా రెండవ మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించింది. అయితే ఇవాళ ధర్మశాల వేదికగా మరో టి20 మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్ నేప‌థ్యంలో కాసేప‌టి క్రిత‌మే టాస్ ప్ర‌క్రియ కూడా ఫినీష్ అయింది. ఇందులో టాస్ గెలిచిన‌ టీమిండియా, మొద‌ట బౌలింగ్ చేసేందుకు నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ద‌క్షిణాఫ్రికా మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది.

Also Read: T20 World Cup 2026: అదంతా ఫేక్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌సారాల‌పై ICC అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌, 2027 వ‌ర‌కు ఢోకా లేదు

బుమ్రా, అక్ష‌ర్ లేకుండా బ‌రిలోకి సూర్య‌

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా (  India vs South Africa, 3rd T20I ) మధ్య మరికాసేపట్లోనే మూడవ టి20 ప్రారంభం కానుంది. ధర్మశాల లోని ( Dharmashala) హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇందులో టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. సెకండ్ బౌలింగ్ చేసేటప్పుడు మంచ్ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కాబట్టి బౌలర్లకు అస్సలు పిచ్‌ అనుకూలించ‌బోద‌న్న మాట‌. అందుకే సూర్య కుమార్ యాదవ్ టాస్ గెలిచి వెంటనే బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.

అంతేకాదు రెండు భారీ మార్పులతో బరిలోకి టీమిండియా దిగుతోంది. అక్షర్ పటేల్ అలాగే బుమ్రా ఈ మ్యాచ్ లో ఆడడం లేదు. వాళ్ళిద్దరి స్థానంలో కుల్దీప్ యాదవ్ అలాగే హర్షిత్ రాణా బరిలోకి దిగుతున్నారు. బుమ్రా ఉన్నఫ‌లంగా సిరీస్ నుంచి వైదొలిగి ఇంటికి వెళ్ళాడట. ఇంట్లో పర్సనల్ కారణాల వల్ల బుమ్రా ఈ మ్యాచ్ కు దూరమైనట్లు సూర్యకుమార్ వెల్లడించారు. అటు అక్షర్ పటేల్ ఆరోగ్యం బాగాలేదట. అతనికి ఫీవర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరినీ తొలగించి, కుల్దీప్ యాదవ్ అలాగే హర్షిత్ రాణా ఇద్దరిని జట్టులోకి తీసుకున్నాడు సూర్య. సరిగ్గా ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్ వేదికగా ఈ మ్యాచ్ లు ఉచితంగానే చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా వస్తాయి.

Advertisement

Also Read: Messi Meets Revanth: నేడే రేవంత్ రెడ్డి వ‌ర్సెస్‌ మెస్సీ మ్యాచ్‌…షెడ్యూల్ ఇదే,ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు

టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు

టీమిండియా (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(w), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(w), ఐడెన్ మార్క్రామ్(c), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×