Anil Chaudhary: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 20026 Tournament) నేపథ్యంలో నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( Mumbai Indians vs Chennai Super Kings) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అట్టర్ ఫ్లాప్ అయిన ముంబై ఇండియన్స్… చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో కంకషన్ సబ్‌స్టిట్యూట్ ( Concussion Substitute ) అంశం వివాదంగా మారింది. ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner ) గాయం బారిన పడ్డాడు. దీంతో కంకషన్ సబ్‌స్టిట్యూట్ తీసుకున్న ముంబై ఇండియన్స్.. సాంట్నర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను (Shardul Thakur ) బరిలోకి దింపింది. అయితే దీనిపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. భుజానికి గాయమైతే కంకషన్ సబ్‌స్టిట్యూట్ వర్తించ బోదని అంటున్నారు. కానీ ముంబై ఓనర్లు ఫిక్సింగ్ చేసిన నేపథ్యంలో అంపైర్లు ఈ కంకషన్ సబ్‌స్టిట్యూట్ ఒప్పుకున్నారని కామెంట్స్ కూడా పెడుతున్నారు.
Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శతకం చేస్తే, బాబర్ మాత్రం సెంచరీ చేస్తాడు
కంకషన్ సబ్‌స్టిట్యూట్… క్రికెట్ లో కూడా కొనసాగుతోంది. అయితే ఈ నిబంధన కొన్ని సమయాల్లో మాత్రమే వర్తిస్తుంది. మ్యాచ్ జరుగుతుండగా ఒక ఆటగాడు తలకు లేదా మెడకు బంతి తగిలితే కంకషన్ సబ్‌స్టిట్యూట్ వాడుకోవచ్చు. అంటే మెదడుకు సంబంధించిన ఎలాంటి గాయం జరిగిన ఈ కంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్ వర్తిస్తుంది. అది కూడా టోర్నమెంట్ కు సంబంధించిన డాక్టర్లు ధ్రువీకరించాలి. అలాంటప్పుడు మరొక ఆటగాడు మైదానంలోకి వస్తాడు. లైఫ్ ఫర్ లైక్ ప్రకారం గాయపడిన ఆటగాడు బౌలర్ అయితే… అచ్చం అలాంటి బౌలర్నే తీసుకోవాలి. ఫాస్ట్ బౌలర్ అయితే ఫాస్ట్ బౌలర్ ను తీసుకోవాలి. స్పిన్నర్ అయితే స్పిన్నర్ తీసుకోవాలి. ఆల్ రౌండర్ అయితే ఆల్ రౌండర్ ను తీసుకోవాల్సి ఉంటుంది. కంకషన్ కింద వచ్చిన కొత్త ప్లేయర్ బ్యాటింగ్ లేదా బౌలింగ్ రెండు చేయవచ్చు.
ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కంకషన్ సబ్‌స్టిట్యూట్ వివాదంపై అనిల్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. రూల్స్ ప్రకారం తలకు గాయం అయితేనే కంకషన్ వర్తిస్తుందని వెల్లడించారు. అయితే మిచెల్ సాంట్నర్ కు భుజంతో పాటు తలకు గాయమైనట్లు ముంబై యాజమాన్యం నిరూపించగలిగిందని స్పష్టం చేశారు. అందుకే అంపైర్లు కూడా కంకషన్ కు పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపారు. కాబట్టి ఇక్కడ వివాదం అనేది ఉండదు. మిచెల్ సాంట్నర్ ఆల్ రౌండర్ కాబట్టి అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ ఆల్ రౌండర్ రూపంలో బరిలోకి దిగాడని వివరించారు.
Shardul Thakur comes in as a concussion substitute for Mitchell Santner, who was injured in the first innings. 🏏🔁#IPL2026 #MIvCSK #Sportskeeda pic.twitter.com/m8alMk5JEe
— Sportskeeda (@Sportskeeda) April 23, 2026