Watch Video: మన దేశంలో క్రికెట్ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. భారతీయులు గల్లీ క్రికెట్ నుండి ఢిల్లీ ఫైట్ వరకు ప్రతి మ్యాచ్ నీ సెలబ్రేట్ చేసుకుంటారు. మొన్నటి వరకు ఐపీఎల్ సిక్స్ లలో తడిసి ముద్దయిన భారత్.. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 – 27 టైటిల్ సాధించేందుకు వేటను ప్రారంభించింది. అయితే క్రికెట్ లో సాధారణంగా పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకోవడం మనం నిత్యం చూస్తూనే ఉంటాము.
Also Read: RCB after IPL trophy: RCB కప్ గెలవడం ఏమో కానీ.. ఇన్ని దరిద్రాలు చుట్టుకున్నాయా
ఈ మధ్యకాలంలో ప్రధానంగా క్రికెట్ పరంగా పలు రకాల ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ కారణంగా.. గల్లీల్లో కూడా విపరీతంగా క్రికెట్ ఆడుతుంటారు. ఏ రాష్ట్రంలో చూసినా పంటపొలాల వద్ద, లేదా గల్లీల్లో, చిన్న చిన్న మైదానాల్లో, స్కూల్ లేదా కాలేజ్ లలో రకరకాల ప్రదేశాలలో క్రికెట్ ఆడుతుంటారు. ఇక కొందరు పండుగ వేళల్లో చిన్న చిన్న గ్రామాల వారు టోర్నమెంట్స్ పెట్టి కూడా క్రికెట్ ఆడుతుంటారు.
ఇలా గల్లీలో క్రికెట్ ఆడుతూ.. ఇటీవల పలు ఫన్నీ వీడియోలను కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇలా క్రికెట్ పై తీసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. తాజాగా కొంతమంది యువకులు ఓ మైదానంలో క్రికెట్ ఆడుతూ క్రియేట్ చేసిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్లు.. క్రికెట్ లో మరో కొత్త ట్రిక్ అన్ లాక్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియోలో ఓ యువకుడు బౌలింగ్ వేయడంతో.. బ్యాట్ పట్టుకున్న మరో యువకుడు ఆ బంతిని స్ట్రెయిట్ డ్రైవ్ ఆడతాడు. దీంతో వెంటనే ఆ బంతిని తన చేతిలోకి తీసుకుంటాడు బౌలర్. అప్పటికే నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ రన్ తీసేందుకు సగం దూరం వరకు పరిగెత్తుకొస్తాడు. ఇక తాను అవుట్ అయ్యానని భావించిన నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న బ్యాటర్.. ఆ రనౌట్ నుండి తప్పించుకునేందుకు బౌలర్ ని మాటల్లో పెడతాడు.
Also Read: T20 World Cup: ఇంగ్లాండ్ చేతిలో చిత్తు.. కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్న టీమిండియా ప్లేయర్లు !
స్ట్రైక్ లో ఉన్న బ్యాటర్ తో మాట్లాడుతూ.. ” ఒక్కొక్క పరుగు తీయవద్దు. కేవలం ఫోర్ లేదా సిక్స్ కొట్టు. ఇతడు అంత పెద్ద బౌలర్ ఏం కాదు. ఇతడి బౌలింగ్ లో 40 లేదా 50 పరుగులు కొట్టు. నేను ఇక్కడే నిలబడతాను. నువ్వు కొడుతూనే ఉండు” అని మాట్లాడుతూ, మెల్లిగా వెనక్కి నడుస్తూ.. వెంటనే బ్యాట్ ని క్రీజ్ లో చేరుస్తాడు. ఇలా తీసిన ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతర్జాతీయ క్రికెట్ లో కూడా ఇలా ఫన్నీ సంఘటనలు చోటు చేసుకోవడం కామన్. ఆ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ యువకులు సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నారు.
?utm_source=ig_web_copy_link