Viswambhara Movie : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర.. వశిష్ట డైరెక్షన్లో తెరకెక్కుతోన్న సోషియో ఫాంటసీ మూవీగా రాబోతుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తీస్తోన్న ఈ చిత్రంలో త్రిష , ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని పనులు సక్రమంగా జరిగితే ఈ ఏడాది సంక్రాంతికే ఈ చిత్రం విడుదలయ్యేది.. ఈ మూవీ సోషియో ఫాంటసీ మూవీ గా రాబోతున్న నేపథ్యంలో ఇందులో విఎఫ్ఎక్స్ వరకు ఎక్కువగానే ఉంటుంది దానివల్లే విడుదల అనుకున్న టైం కి అవ్వలేక పోతుంది.. అయితే ఈ సినిమా గురించి ఇప్పటికే పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట ప్రచారంలో ఉంది.
ఐటమ్ గర్ల్ గా నాగిని బ్యూటీ..
ఈ మధ్య చిరంజీవి నుంచి వస్తున్న సినిమాలకు ఐటెం సాంగ్స్ మంచి ఊపురిస్తున్నాయి. ఇప్పుడు రాబోతున్న విశ్వంభర మూవీ లో కూడా ఐటమ్ సాంగ్ హైలెట్ కానుందని సమాచారం. ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ నాగిని ఫేమ్ మౌని రాయ్ ను డిసెంబర్ టీం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఈ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సాంగ్ గురించి పూర్తి వివరాలను టీం వెల్లడించే అవకాశం ఉంది.. ఇదే కనుక నిజమైతే మాత్రం ఈ సాంగ్ నిజంగానే మెగా ఫాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయం.
Also Read : జూలైలో థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ మూవీ కోసమే వెయిటింగ్..2
‘విశ్వంభర ‘ విడుదల ఎప్పుడు..?
గతంలో చిరు భోళా శంకర్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించారు.. ఆ మూవీ థియేటర్లు లోకి వచ్చిన మొదటి రోజునే దారుణమైన కామెంట్స్ ని అందుకుంది. ఆ తర్వాత భారీ అంచనాలతో రాబోతున్న సినిమా విశ్వంభర.. బింబిసారా డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 2023 సెకండాఫ్ లో సెట్స్ పైకి వెళ్ళింది. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని 2024 సంక్రాంతి టైంలోనే అనౌన్స్ చేశారు.. ఎప్పుడైతే గ్లింప్స్ బయటకు వచ్చిందో.. అప్పుడు రిలీజ్ ప్లానింగ్ అంతా మారిపోయింది. వి.ఎఫ్.ఎక్స్ పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల 2025 సంక్రాంతి రేసు నుండి సినిమా తప్పుకుంది. ఆ తర్వాత కొత్త రిలీజ్ డేట్ ని ఇప్పటివరకు ప్రకటించింది లేదు.. అయితే ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. ఏది ఏమైనా కూడా మెగా ఫాన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. సంక్రాంతి వస్తున్నాం ఫేమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మెగా 157 సినిమా చేస్తున్నాడు.. తమిళ స్టార్ హీరోయిన్ నయనతార చిరంజీవికి జోడిగా నటిస్తుంది.