Jupiter: గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశులకు, వాటికి సంబంధించి కొందరు వ్యక్తుల జీవితాలపై ప్రభావితం చేస్తాయి. అందులో మంచి, చెడు రెండూ ఉంటాయి. ప్రస్తుతం మిధున రాశిలో సంచారం చేస్తున్న గురువు, పదో నెల అనగా అక్టోబర్‌లో కర్కాటక రాశిలోకి ఎంటర్ కానున్నాడు. దీనివల్ల ఆ మూడు రాశులకు తిరుగులేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ రాశులేవో, వాటిపై ఓ లుక్కేద్దాం.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం నిత్యం మారుతూ ఉంటుంది. ఆయా గ్రహాలు ఎక్కడ స్థిరంగా ఉండవు. అలా కదులుతూనే ఉంటాయి. వాటి వల్ల కొన్ని రాశులవారికి మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో గురువుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాంటి గురువు దాదాపు పుష్కర కాలం తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.
సరిగ్గా అక్టోబర్ నెలలో గురువు మిధునం నుంచి కర్కాటక రాశిలోకి రాబోతున్నాడు. ఇలా రాశుల్లోకి రావడం వల్ల మనకు కలిసి వచ్చేదేంటి? అనుకుంటున్నారా? అక్కడికే వెళ్దాం. గురువు సంచారం కర్కాటక రాశిలో రానున్న సందర్భంగా ద్వాదశ రాశులు, వాటికి సంబంధించిన జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ మూడు రాశుల వారి జీవితాల్లో శుభాలను చేకూర్చబోతున్నట్లు చెబుతున్నారు. ఇంతకీ ఆ రాశులేంటి?
తులారాశి- గురువు కర్కాటక రాశిలోకి రావడంతో తులా రాశి జాతకులకు బాగానే కలిసొస్తుంది. అక్టోబర్ నుంచి ఈ రాశివారు అదృష్టవంతులుగా మారుతున్నారు. నూతన ఉద్యోగాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వర్తక వ్యాపారాలకు ఆ సమయం అనుకూలమైంది. ఈ సమయంలో భారీగా లాభాలను అర్జిస్తారు. అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలకు తిరుగులేదు. ఈ టైమ్ హ్యాపీగా సంతోషంగా జీవిస్తారు.
వృశ్చిక రాశి- గురువు రాకతో కలిసి వస్తున్న రాశుల్లో వృశ్చిక రాశి కూడా ఒకటి. వృత్తి వ్యాపారాలలో ఊహించని విజయాలు సాధిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలేకాదు, పోటీ పరీక్షలకు రెడీ అవుతున్నవారికి సానుకూలంగా ఫలితాలు రానున్నాయి. ఆ సమయంలో వృశ్చిక రాశి వారు ఏ పని చేసిన లాభాలే లాభాలన్నమాట.
మీనరాశి- గురువు సంచారంతో కలిసి వచ్చిన చివరి రాశి మీనరాశి. ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారని చెబుతున్నారు జ్యోతిష్యులు. కొత్త ఉద్యోగ అవకాశాలు, దాంతోపాటు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పని మొదలుపెట్టినా సత్ఫలితాలు వస్తాయి. వర్తక వ్యాపారం గురించి చెప్పనక్కర్లేదు. పైన చెప్పిన విధంగానే మాంచి రాబడి ఉంటుంది.
సూచన- జ్యోతిష్య నిపుణుల సలహాలు ఆధారంగా ఇస్తున్నాము. అలాగే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం క్రోడీకరించి ఇస్తున్నాము. దీనిని తాము ధ్రువీకరించలేదు. దయచేసి గమనించగలరు.