IND VS PAK: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు దగ్గర పడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లు అలాగే మాజీలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇండియాను టార్గెట్ చేసి అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ విషయంలో ఇండియాను విలన్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంతేకాకుండా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇండియాను ఓడిస్తామని శపథం కూడా చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ( Usman Tariq ) కూడా సంచలన స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇండియాను ఓడించేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. తన సింగిల్ హ్యాండ్ తో టీమిండియాను ఓడిస్తానని హెచ్చరించాడు. అల్లా మీద ఒట్టు టీమిండియాను ఓడించి తీరుతానని ఛాలెంజ్ విసిరాడు ఉస్మాన్ తారిక్. ఇది నా జీవిత కాల కోరిక అంటూ హాట్ కామెంట్స్ చేశాడు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. లీగ దశలో ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కొలంబో వేదికగా నిర్వహించనున్నారు. పాకిస్తాన్ కోసం తటస్థ వేదిక గా శ్రీలంకను ఫైనల్ చేశారు. దీంతో ఈ మ్యాచ్ కొలంబో వేదికగా నిర్వహించనున్నారు. అయితే ఇప్పటి వరకు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ఆడే దానిపైన అధికారిక ప్రకటన చేయలేదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. కానీ ఇంతలోనే ఇండియాను ఓడిస్తామని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ప్లేయర్లు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు.
తాజాగా పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ( Usman Tariq ) కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ఓడించడం తన జీవితకాల కోరిక అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగిల్ హ్యాండ్ తో టీమ్ ఇండియాను ఓడిస్తానని సంచలన ప్రకటన కూడా చేశాడు ఉస్మాన్ తారిక్. అయితే ఉస్మాన్ తారిక్ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. నీకు బౌలింగ్ సరిగ్గా వేయరాదు ? అలాంటిది సింగిల్ హ్యాండ్ తో ఎలా ఓడిస్తావురా ? అంటూ నిప్పులు చెరుగుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్. ఇలాంటి ప్లేయర్లను అంతర్జాతీయ క్రికెట్ నుంచి బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. బంతి విసిరేయడం తప్ప వీడికి బౌలింగ్ వేయడం రాదని చురకలు అంటిస్తున్నారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ జట్టుకు సల్మాన్ అలీ అఘా కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఈ జట్టులో ఉస్మాన్ తారిక్ కూడా ఉన్నాడు.
?igsh=empiMGFucnhic3Bk