E-Paper
Advertisement

టెస్ట్ క్రికెట్ లోకి వైభ‌వ్ సూర్య‌వంశీ..వ‌ణికిపోతున్న బ్రియాన్ లారా

టెస్ట్ క్రికెట్ లోకి వైభ‌వ్ సూర్య‌వంశీ..వ‌ణికిపోతున్న బ్రియాన్ లారా
Advertisement

Vaibhav Sooryavanshi Into Tests:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ పైన (Vaibhav Sooryavanshi) ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఆరెంజ్ క్యాప్ కూడా దక్కించుకొని.. అందరి మన్ననలను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్య వంశీ, టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని కూడా మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. వెంటనే అతని టీమిండియాలోకి తీసుకొని, వాడుకోవాలని బిసిసిఐకి సూచనలు చేస్తున్నారు. అయితే, టి20 లో భయంకరంగా ఆడుతున్న వైభవ్, టెస్ట్ క్రికెట్ పైన ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. టి20 లతోపాటు టెస్ట్ క్రికెట్ ఆడడం తన లక్ష్యమని వైభవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు ! Inzamam-ul-Haq

టెస్టులు కూడా ఆడ‌తా – వైభ‌వ్

Advertisement

2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ముగిసిన నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్… వైభవ్ ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు వైభవ్ ఇచ్చిన ఆన్సర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తనకు టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. అందులో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం టి20 క్రికెట్ పైన ఫోకస్ చేసినట్లు పేర్కొన్న వైభవ్, తర్వాత వన్డేల్లో కూడా ఆడతానని వెల్లడించారు. అనంతరం టెస్టుల్లో రాణించేందుకు ప్రయత్నిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ క్రికెట్లో కూడా దూకుడే లక్ష్యంగా ఆడతనని స్పష్టం చేశాడు. ప్రస్తుతం టి20 క్రికెట్ లో తన కోచ్ లు అందరూ పూర్తి స్వేచ్చని ఇచ్చారని.. అందుకే ప్రతి బంతిని సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఇక వన్డేలో రాణించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుందని.. త్వరలో దానిపైన ఫోకస్ పెడతా. టెస్ట్ క్రికెట్ అసలైన ఫార్మాట్ అని, తన నాన్న పదే పదే క్లాస్ పీకే వాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. అందుకే టెస్టులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రంజీ ట్రోఫీ ఆడినప్పుడు టెస్ట్ లలో అవకాశం రాలేదని, కానీ టీమిండియా తరఫున బరిలోకి దిగుతానని వెల్లడించాడు.

టెస్టుల్లోకి వైభవ్ వస్తే, లారా రికార్డులు బద్దలే

టెస్టుల్లో బ్రియాన్ లారా (Brian Lara) 400 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. 2004 సంవత్సరంలో ఇంగ్లాండు పై జరిగిన టెస్ట్ సందర్భంగా ఈ భయంకరమైన ఇన్నింగ్స్ ఆడాడు లారా. 582 బంతులు ఎదుర్కొన్న లారా… 400 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 43 ఫోర్లు కొట్టిన లారా నాలుగు సిక్సర్స్ సాధించాడు. ఈ క్రమంలో హేడెన్ సాధించిన 380 పరుగుల రికార్డు బద్దలైంది. అయితే ఇప్పుడు వైభవ్ టెస్టుల్లోకి వస్తే.. 400 కాదు 500 కొట్టిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. క్రిస్ గేల్ రికార్డు బదులు కొట్టిన వైభవ్.. ఇప్పుడు లారా పై ఫోకస్ చేసినట్లు పేర్కొంటున్నారు. టెస్టుల్లో వైభవ్ ఆడితే అందరూ చూసే అవకాశం ఉంటుందని.. దాని వ్యూయర్షిప్ కూడా పెరుగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Also Read: Vaibhav Sooryavanshi   వైభ‌వ్ ను దెబ్బ‌కొట్టేందుకు పాకిస్తాన్ పెద్ద కుట్ర‌..రాజ‌స్థాన్ లో సీక్రెట్ ఏజెంట్ ను పెట్టిమ‌రీ?

 

Related News

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

మిస్ట‌ర్ బాబ‌ర్‌…పాకిస్తాన్ వీధుల్లో తిరగ‌కు, తేడా వ‌స్తే రాళ్లతో కొడ‌తారు!

ధోని మాములోడు కాదురా….2007లో పాకిస్తాన్ ను వెర్రి పుష్పాల‌ను చేశాడు

టెస్టులు, వ‌న్డేల‌కు బుమ్రా ప‌నికిరాడు…వెళ్లి ఐపీఎల్ ఆడుకోరా !

పాకిస్తాన్ లాంటి జోకర్లతో టెస్టులు ఆడి, ఇంగ్లాండ్ టైం వృధా చేసుకుంటోంది

టీమిండియా క్రికెటర్ తో గిల్ సోదరి డేటింగ్…షాకింగ్ వీడియో వైరల్!

Big Stories

Advertisement
×