Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ డేంజర్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా అత్యంత భయంకరంగా బ్యాటింగ్ చేసి.. ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. క్రిస్ గేల్ సాధించిన హైయెస్ట్ సిక్సర్ల రికార్డు కూడా బద్దలు కొట్టాడు. ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కూడా నిలిచాడు. అయితే అలాంటి వైభవ్ సూర్య వంశీ పై (Vaibhav Suryavanshi) కొత్త కుట్రలు తెరపైకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వైభవ్ సూర్యవంశీ వీక్నెస్ లు మొత్తం పాకిస్తాన్ కు చేరవేసేందుకు కుమార సంగక్కర (Kumar Sangakkara) ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ కోచ్ గా కుమార సంగక్కర ఉన్న సంగతి తెలిసిందే. అంతకుముందు కూడా రాజస్థాన్ జట్టుకు పని చేశాడు కుమార సంగక్కర. ఈ క్రమంలో ఇండియన్ క్రికెటర్లకు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకున్నాడు. ఇక ఈ మధ్యకాలంలో అదరగొడుతున్న వైభవ్, మైనస్, పాజిటివ్ పాయింట్స్ మొత్తం కూడా కుమార సంగక్కరకు తెలుసు. అతన్ని ముందుండి నడిపించింది కూడా కుమార సంగక్కరనే కావడం గమనార్హం. అయితే అలాంటి కుమార సంగక్కర ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళబోతున్నాడు. త్వరలోనే అతన్ని కోచ్ గా నియామకం చేసుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుందట. ముందుగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్ పేరు వినిపించినప్పటికీ… చివరి క్షణంలో వెనక్కి తగ్గిందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. చాలా సంవత్సరాలుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో పనిచేస్తున్న కుమార సంగక్కర అయితేనే పాకిస్తాన్ జట్టును బాగా డీల్ చేస్తాడని ఓ నిర్ణయానికి వచ్చారట మొహ్సిన్ నఖ్వీ.
అలాగే ఇండియన్ క్రికెటర్ల వీక్నెస్ కూడా కుమార సంగక్కర కు బాగా తెలుసు అన్న ఒక్క కారణంతో అతడిని సెలెక్ట్ చేశారట. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీని కూడా పాకిస్తాన్ టార్గెట్ చేయవచ్చని, అందుకే కుమార సంగక్కర పేరును ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. ఈ మధ్య భయంకరంగా ఆడుతోన్న వైభవ్ ను మొగ్గ దశలోనే తుంచాలన్న లక్ష్యంతో పాకిస్తాన్ పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి భారీగా ఆఫర్ కూడా కుమార సంగక్కరకు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే త్వరలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా కుమార సంగక్కర నియామకం కానున్నాడు. అలా జరిగితే ఇండియన్ క్రికెటర్ల భవితవ్యం మొత్తం పాకిస్తాన్ ప్లేయర్లకు తెలిసిపోనుందని విశ్లేషకులు చెబుతున్నారు.