Vaibhav Suryavanshi’s classmates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 tournament) నేపథ్యంలో అద్భుతంగా రాణించిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. టీమిండియాలో ఛాన్స్ కొట్టేశాడు. అయితే అతడి అరంగేట్రం మాత్రం ఆలస్యం అవుతోంది. ఐర్లాండ్, ఇంగ్లాండుతో జరుగుతోన్న టి20 సిరీస్ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేసింది బీసీసీఐ. కానీ ఐర్లాండ్ సిరీస్ సందర్భంగా వైభవ్ సూర్య వంశీకి అవకాశం రాలేదు. ఇక ఇంగ్లాండ్ సిరీస్ లో ( England vs Team India) అయినా అవకాశం వస్తుందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే నిన్న టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టీ20 జరిగినప్పటికీ వైభవ్ కు నిరాశ మిగిలింది. ఈ సిరీస్ లో కూడా వైభవ్ కు అవకాశం వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇలాంటి క్రమంలో వైభవ్ సూర్యవంశీ అభిమానులు సీరియస్ అవుతున్నారు. గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కారణంగానే వైభవ్ సూర్య వంశీకి అవకాశాలు రావడంలేదని అంటున్నారు. భూమికి జానెడు లేని వాళ్లు కూడా సోషల్ మీడియా వేదికగా వీడియోలు పెట్టి, గంభీర్ కు వార్నింగ్ ఇస్తున్నారు.
15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్య వంశీ టీమిండియా తరఫున బరిలోకి దిగాలని చాలామంది మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా తమ డిమాండ్లను వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్ , ఇర్ఫాన్ పఠాన్ లాంటి వాళ్లు సోషల్ మీడియాలో మొత్తుకుంటున్నారు. సంజు శాంసన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీని తీసుకోవాలని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీ క్లాస్ మెట్స్ కూడా రెచ్చిపోతున్నారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు వార్నింగ్ ఇస్తున్నారు. ఒరేయ్ గంభీర్.. అమ్మతోడు అడ్డంగా నరికేస్తాం.. అనే సినిమా డైలాగులతో రెచ్చిపోయి ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు వైభవ్ స్నేహితులు.
అద్భుతంగా రాణిస్తున్న తమ దోస్తు వైభవ్ ను టీమిండియాలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే నీ అంతు చూస్తామని హెచ్చరించారు. సంజు శాంసన్ స్థానంలో వైభవ్ కు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు అంటూ హితువు పలుకుతున్నారు. అన్యాయంగా వైభవ్ సూర్యవంశీ కెరీర్ నాశనం చేయకూడదని.. మండిపడుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో మా వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణించాడని గుర్తు చేస్తున్నారు. కావాలంటే మరొకసారి ఐపీఎల్ టోర్నమెంట్ లోని రాజస్థాన్ మ్యాచ్ లు అన్ని కూడా తిలకించు.. అప్పుడైనా నీకు బుద్ధి వస్తుందని గంభీర్ కు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంగ్లాండ్ తో జరిగే రెండో టి20 నేపథ్యంలో వైభవ్ కు అవకాశం ఇవ్వకపోతే, నిన్ను ఇండియాలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు వైభవ్ స్నేహితులు.
Vaibhav Suryavanshi's classmate.💀😭 pic.twitter.com/AXZHMBv3tv
— Cricket Central (@CricketCentrl) July 1, 2026