E-Paper
Advertisement

KTR Formula Race Case: గవర్నర్ పర్మిషన్..? కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం!!

KTR Formula Race Case: గవర్నర్ పర్మిషన్..? కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం!!
Advertisement

KTR Formula Race Case: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫార్మూలా రేస్ కేసు మళ్లీ హీటెక్కింది. కేటీఆర్‌పై ఏసీబీ విచారణకు గవర్నర్ ఇచ్చిన అనుమతి ఇచ్చారు. దీంతో ఏసీబీ తర్వలోనే కేటీఆర్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించనుంది ఏసీబీ.

ఈ కేసులో A1గా కేటీఆర్, అరవింద్ కుమార్ A2, బీఎల్ఎన్ రెడ్డి A3 గా పేర్కొంది. ఇప్పటికే కేటీఆర్ ఈ కేసు విషయంలో నాలుగు సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఏ2 గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే అధికారులు కేంద్రంలోనీ గవర్నర్‌‌కు లేఖ రాశారు.

Advertisement

గవర్నర్ అనుమతి నేపథ్యంలో ఛార్జ్ షీట్ ధాఖలకు ముందు ఏసీబీ అధికారులు.. మరోసారి కేటీఆర్‌ను లేదా ఇతర కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది. ఏసీబీ తర్వలో దాఖలు చేయబోయే ఛార్జ్ షీట్‌ తో ఈ కేసు విచారణ కీలక మలుపు తిరగనుంది. కేటీఆర్‌తో విచారణకు గవర్నర్ అనుమతి కోరింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫార్ములా ఈ కారు రేసులో అధికార దుర్వినియోగం, క్విడ్ ప్రోకో లాభాలు, తప్పుదారి ఒప్పందాలు జరిగాయని, మొత్తం వ్యవహారంలో రూ.54.88 కోట్ల మోసపూరిత లాభాలు జరిగినట్లు ఏసీబీ సమర్పించిన సమాచారం సూచిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయాల్లో కేటీఆర్ కీలక పాత్ర ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

రేస్ కోసం పురపాలకశాఖ 2022 అక్టోబర్ 25న ఒప్పందం కుదుర్చుకుంది. 2023 ఫిబ్రవరి 11న జరిగిన రేస్ కోసం రూ.12 కోట్లు ఖర్చు చేసింది హెచ్ఎండీఏ. డిసెంబర్ 20, 2024 లో పీఎంఎల్ఏ కింద ఈడీ కేసు నమోదు చేసింది.

Advertisement

Also Read: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి.. మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకోనున్న ద్రౌపది ముర్ము..

ఈ కారు రేస్ లో రూల్స్‌కి విరుద్ధంగా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించాలని మున్సిపల్ కార్యదర్శి ఫిర్యాదుతో ఈ కేసు నమోదు అయింది. ప్రభుత్వానికి 54.88 కోట్లు నష్టం కలిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా ప్రభుత్వం మాత్రం.. కేటీఆర్ దోషాలు బయటపడతాయి. అధికారం దుర్వినియోగం బయటపడింది అని చెబుతుంటే, మరోవైపు బీఆర్‌ఎస్ మాత్రం ఇది కాంగ్రెస్ , బీజేపీ కలిసి చేస్తున్న రాజకీయ వేధింపులు అంటున్నారు.

దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. జైలుకు వెళ్లడానికి సిద్ధం. అక్కడ జాగింగ్ చేస్తాను, యోగ చేస్తాను అని వ్యాఖ్యానించడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×