E-Paper
Advertisement

India-EU Trade Deal: ఇండియా, ఈయూ ట్రేడ్ డీల్ కుదిరింది.. ఈ డీల్‌ తో భారత్ జరగే లాభం ఇదే!

India-EU Trade Deal: ఇండియా, ఈయూ ట్రేడ్ డీల్ కుదిరింది.. ఈ డీల్‌ తో భారత్ జరగే లాభం ఇదే!

India-EU Trade Deal: డీల్ కుదిరింది.. ఇండియా, ఈయూ ట్రెడ్ హిస్టరీలో సరికొత్త చాప్టర్ స్టార్టయ్యింది. మదర్‌ ఆఫ్‌ ఆల్ డీల్స్‌పై సంతకాలు జరిగిపోయాయి. ఈ డీల్ అలా కుదిరిందో లేదో.. ఎక్కడో కాలుతున్న వాసన రావడం స్టార్టయ్యింది. ముఖ్యంగా పెద్దన్నగా చెప్పుకునే అమెరికా ఇప్పుడు ఈ డీల్‌పై తన అక్కసు వెళ్లగక్కుతుంది. నిజం చెప్పాలంటే లాక్కోలేని.. పిక్కోలేని సిట్యూవేషన్ అగ్రరాజ్యానిది. అందుకే తన కడుపుమంటను మాటల్లో చూపిస్తుంది. ఇంతకీ ఈ డీల్‌ ఎందుకంత స్పెషల్.. అసలు అమెరికా ఎందుకంత ఉడుక్కుంటుంది?

భారత్-ఈయూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్

చాలా రోజులుగా చర్చలో ఉన్నదే.. ప్రజల పెదాలపై నానుతున్నదే భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంలో అత్యంత కీలకం ఈ డీల్. ఈ డీల్‌పై ఈయూ, భారత్ సంతకాలు చేశాయని ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనౌన్స్ చేశారు. సరే ఈ డీల్‌ గురించి.. దాని వల్ల జరిగే లాభాల గురించి చెప్పుకునే ముందు మీరు ఒక్కసారి ఈ వ్యాఖ్యలు వినండి.

రష్యన్ చమురు గేమ్.. భారత్ ద్వారా యూరోప్‌కు

విన్నారుగా.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్‌ బెసెంట్‌. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25 శాతం సుంకాలను విధించాం., కానీ ఏం జరిగిందో చూశారా? యురోపియన్లు భారత్‌తో ట్రేడ్‌ డీల్‌ కుదుర్చుకున్నారు. రష్యన్ చమురు మొదట భారత్‌కు వెళ్తోంది. అక్కడి నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు బయటకు వస్తున్నాయి. వాటిని యూరప్‌ దేశాలు కొనుగోలు చేస్తున్నారు. అంటే తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నారు.. అంటూ చెప్పుకొస్తున్నారు.

టారిఫ్ తగ్గింపుపై మాట మార్చిన అమెరికా

ఈ స్కాట్‌ దొరవారే ఎగ్జాక్ట్‌గా రెండు రోజుల క్రితం.. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లు తగ్గించింది.. ఇక మేము కూడా టారిఫ్‌లు తగ్గిస్తామని సెలవిచ్చారు. కానీ ఏమైందో ఏమో.. ఒక్కరోజులోనే ఆయన మాట మారింది. మొత్తంగా ఆయన కడుపుమంటను ఏ మాత్రం దాచుకోకుండా కక్కేసింది అమెరికా. ఈయూ, భారత్ మధ్య ట్రెడ్ డీల్ జరగడాన్ని అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతుంది.

మా మాటే నడవాలి అన్న అమెరికా ఆలోచనకు షాక్

ఈ డీల్ కుదరడం తమకు చాలా విధాలుగా నష్టం చేస్తుంది అనేది అమెరికా ఆలోచన. అది నిజమే కూడా. ఇప్పటి వరకు రక్షణ రంగంలో అయినా.. ట్రేడ్‌లో అయినా తమను మించిన వారే లేరు అనేది అమెరికా ఆలోచన. కానీ ఇప్పుడు ఇలాంటి డీల్స్‌ దానికి కత్తెర పెడతాయి. మాట్లాడితే టారిఫ్‌లు విధిస్తానంటూ బెదిరిస్తూ.. నిజంగానే విధిస్తూ తమకు కావాల్సినట్టుగా దేశాలను ఆడిస్తోంది అమెరికా. కానీ ఇకపై అలా కుదరదు. ప్రపంచ దేశాలన్ని ఇప్పుడు అల్టర్‌నెట్‌లపై ఫోకస్ చేస్తున్నాయి. ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తే జరిగే నష్టాలేంటో ఇప్పటికే అమెరికా చూపిస్తోంది. అందుకే ఈ డీల్‌ అమెరికాకు ఒక చెంపపెట్టులాంటిది.

భారత్ యూరోపియన్ మార్కెట్లో కొత్త దారి

ఈయూ తన GDPR తరహా నిబంధనలను భారత్‌తో ఒప్పందంలో చేర్చితే, గూగుల్, అమెజాన్ వంటి అమెరికన్ టెక్ దిగ్గజాలకు భారత్‌లో వ్యాపారం చేయడం కష్టమవుతుందని అమెరికా భయం. అంతేకాదు భారత్‌ను తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనేది అమెరికా ఆలోచన. కానీ ఈ డీల్‌తో భారత్ ఈయూతో లోతైన ఆర్థిక బంధాన్ని ఏర్పరుచుకున్నట్టే అని చెప్పాలి. సో.. ఇప్పుడు ఇండియన్‌ మార్కెట్‌లో ఒక షిఫ్ట్‌ ఏర్పడుతుంది. ఇకపై అమెరికాపైనే ఫోకస్ చేసే మార్కెట్‌.. ఇక యూరోపియన్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఇదే జరిగితే తమ ఎగుమతులు దెబ్బతినవచ్చనేది అమెరికా భయం. ఈ డీల్‌తో తాము అమెరికాపై పూర్తిగా ఆధారపడి లేమని భారత్ చెప్పినట్టైంది.

ఏ దేశమూ భారత్‌ను ఇగ్నోర్ చేయలేవు

భారత్‌ అంటే ఓ పెద్ద మార్కెట్. 140 కోట్లకు పైగా జనాభా ఉంది మన దేశంలో. ఏ దేశమైనా మనలను ఇగ్నోర్ చేసే పరిస్థితి లేనే లేదు. ఏ దేశ వస్తువులు అమ్ముకోవడానికైనా.. వ్యాపారం చేయడానికైనా భారత్‌ను మించిన దేశం మరోకటి లేదు. అందుకే ఇప్పుడు అన్ని దేశాలు భారత్‌వైపే చూస్తున్నాయి.

భారత–ఫ్రాన్స్ సంబంధాల్లో కొత్త అధ్యాయం

ఇక మరో విషయం ఏంటంటే.. ఈయూ డీల్ కుదిరిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ భారత్‌లో ల్యాండ్ కాబోతున్నారు. ఢిల్లీలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు రానున్నారు. ఈ సమ్మిట్ ఫిబ్రవరి 19, 20న జరుగుతుంది. గ్లోబల్ సౌత్‌లో నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ AI సమ్మిట్‌ ఇదే. ఈ సమ్మిట్‌ జరిగే సమయంలో ఇరు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు జరగనున్నాయి.

ఇరు దేశాల మధ్య చర్చలు

నెక్ట్స్‌.. కెనడా ప్రధానమంత్రి మార్క్‌ కార్నీ కూడా మార్చిలో భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల కారణంగా కెనడా కొత్త దారులు వెతుకుతోంది. ఇప్పుడు భారతదేశాన్ని తన కీలక వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామిగా చూస్తోంది. రెండు సంవత్సరాల పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా లేవు. జస్టిన్ ట్రూడో మిగిల్చిన కొన్ని చేదు జ్ఞాపకాలను మర్చిపోయేలా.. ఇప్పుడు కొన్ని కీలక ఒప్పందాలు ఇరు దేశాల మధ్య జరగనున్నాయి. యురేనియం, ఇంధనం, ఖనిజాలు, AIపై కీలక ఒప్పందాలు జరగనున్నాయి. ఈ డీల్‌ కుదిరితే.. ఈయూ ట్రేడ్‌ డీల్‌కు ఇది ఒక బోనస్‌గా భావించవచ్చు.

భారత్‌ మల్టీ-అలైన్‌మెంట్ వ్యూహం.. అమెరికాకు సవాలు

ఈ పరిణామాలన్ని నిజంగా అమెరికాకు మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే ఈ దేశాలన్ని అమెరికాతో తమ బంధాలను తగ్గించుకొని భారత్‌తో దోస్తీని పెంచుకుంటున్నాయి. భారత్ ఒక భారీ మార్కెట్. ఇక్కడ ఈయూ, కెనడా కంపెనీలు పాగా వేస్తే, అమెరికన్ కంపెనీలకు పోటీ పెరుగుతుంది. ఇదే ఇప్పుడు ఆ దేశాన్ని టెన్షన్ పెంచుతుంది. కానీ భారత్ మాత్రం తన ప్రయోజనాలకు భంగం కలగకుండా, అటు అమెరికాను ఇటు ఈయూను బ్యాలెన్స్ చేస్తూ మల్టీ-అలైన్మెంట్ పాలసీని కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. అమెరికాతో భారత్‌ ఇంకా ట్రేడ్ డీల్‌ చేసుకోలేదు. ఇప్పుడీ పరిణామాలన్నింటి తర్వాత అమెరికా దిగిరాక తప్పదనే చెప్పవచ్చు.

Story by: Anup, Big Tv

ALSO READ: అనంతపురంలో నాన్‌లోకల్‌ హవా..

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×