RCB VS SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ( Indian Premier League 2026 Tournament) సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసిన సంగతి తెలిసిందే. ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో హైదరాబాద్ ( SRH) దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలో ఇంటిదారి పట్టింది హైదరాబాద్. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ ఓడిపోయినందుకు గాను, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore Fans) అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. 15 ఏళ్ల బుడ్డోడి చేతిలో హైదరాబాద్ ఓడిపోయిందని సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు కూడా పెడుతున్నారు. ఇక లేటెస్ట్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ లేడీ అభిమాని ( SRH Lady Fan ) వీడియోను వైరల్ చేస్తూ, బరితెగించారు విరాట్ కోహ్లీ అభిమానులు. ఆమె ఎక్కడ దొరికినా రే**ప్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంటిదారి పట్టిన క్రమంలో.. విరాట్ కోహ్లీ, బెంగళూరు అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై గెలిచినప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ఓ లేడీ ఫ్యాన్, తమ జట్టు టైటిల్ కొట్టబోతుందని శపథం చేసింది. ఎవడు వస్తారో రండి.. ఫిక్సింగ్ చేసే ముంబై వస్తుందా ? మొన్న ఛాంపియన్ అయిన బెంగుళూరు వస్తుందా ? చూసుకుందాం అంటూ సవాల్ విసిరింది సదరు లేడీ అభిమాని. 2016 టోర్నమెంట్ రిపీట్ కాబోతుందని… సన్ రైజర్స్ హైదరాబాద్ కచ్చితంగా గెలుస్తుందని ఆమె ఛాలెంజ్ విసిరారు.
అయితే ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా ఓడిపోయిన హైదరాబాద్ ఇంటి దారి పట్టిన సందర్భంగా… అదే లేడీ అభిమాని పాత వీడియోను రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు అభిమానులు వైరల్ చేస్తూ ఆడుకుంటున్నారు. అక్క ఎక్కడున్నావ్…? ఇప్పుడు ఏమంటావ్ అంటూ పచ్చి బూతులు తిడుతున్నారు. ఇక విరాట్ కోహ్లీ అభిమానులు అయితే ఉగ్రవాదుల్లా రెచ్చిపోతున్నారు. ఎక్కడ కనిపించినా రే**ప్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఆమె అడ్రస్ చెప్పిన వాళ్లకు బంపర్ ఆఫర్ అంటూ ప్రకటనలు కూడా సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ అకౌంటు డీటెయిల్స్ అయినా చెప్పండి అంటూ కోహ్లీ ఫ్యాన్స్ బరితెగిస్తున్నారు. రోడ్డుపై కనిపిస్తే, రే**ప్ లేదా మ*ర్డర్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. అయితే, దీనిపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఒక మహిళ అభిమానిని ఇలాంటి ట్రోల్ చేయడం ఎంత మేరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ అభిమానులు. బెంగళూరు జట్టుకు కూడా లేడీ ఫ్యాన్స్ ఉంటారు కదా? వాళ్లైనా దీనిపై రియాక్ట్ అయి, హైదరాబాద్ అమ్మాయికి సపోర్ట్ గా నిలవాలని కోరుతున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
https://x.com/OneindiaKannada/status/2059937734521655712?s=20