E-Paper
Advertisement

Mining Course: సీఎం రేవంత్‌కు మంత్రి పొన్నం లేఖ..!

Mining Course: సీఎం రేవంత్‌కు మంత్రి పొన్నం లేఖ..!
Advertisement

Mining Course: స్వేచ్ఛ బ్యూరో: హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు మంజూరుకు సీఎం కి విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బొగ్గు తవ్వకాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో..

దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచస్థాయిలో కూడా అర్హత కలిగిన మైనింగ్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యాసంస్థల్లో బి.టెక్ (మైనింగ్ ఇంజనీరింగ్) కోర్సు అందుబాటులో చాలా పరిమితంగా ఉందని, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో ఉన్న అధిక ఫీజుల కారణంగా ఈ కోర్సును అభ్యసించలేకపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also read: వీటితో తక్కువ బడ్జెట్‌లో.. మీ ఇంటికి 24 గంటల సేఫ్టీ

మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు..

హుస్నాబాద్ ప్రాంతం గనుల పరిశ్రమలకు సమీపంలో ఉండటంతో పాటు బొగ్గు గనుల ప్రాంతానికి అనుసంధానమై ఉండటం వల్ల, ఇక్కడ మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు ప్రారంభించడం విద్యార్థులకు మరియు పరిశ్రమలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ (మైనింగ్ ఇంజనీరింగ్) కోర్సును తక్షణమే మంజూరు చేయడంతో పాటు అవసరమైన బోధన మరియు సాంకేతిక సిబ్బందిని కూడా నియమించాలని ముఖ్యమంత్రిని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

Advertisement

Also Read: గాంధీభవన్‌ను షేక్ చేస్తున్న పైరవీల చిట్టా.. ఉద్యోగాల పేరిట భారీ మోసం..!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×