Big Stories

Virat Kohli Fitness : కోహ్లీ ఫిట్‌నెస్ రహస్యం తెలుసా?

Share this post with your friends

Virat Kohli Fitness : టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ గొప్ప ఆటగాడు మాత్రమే కాదు… ఫిట్‌నెస్ విషయంలోనూ అంతకుమించిన సామర్థ్యం ఉన్న వ్యక్తి. దంచి కొట్టడమే కాదు… మైదానంలోనూ, వికెట్ల మధ్యా వేగంగా పరిగెత్తడంలోనూ… సమకాలీన క్రికెట్లో ఎవరూ కోహ్లీకి సాటిరారంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ కోహ్లీ స్టామినాకు కారణాంలేంటో తెలుసా…

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ సీక్రెట్ ను బయటపెట్టాడు… కోహ్లీ. జిమ్ లో కసరత్తులు చేయడంతో పాటు… మాంసాహారానికి దూరంగా ఉంటానని… తీపి వంటకాలు కూడా తినడం మానేశానని కోహ్లీ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా ట్రేడ్ మార్క్ వంటకమైన మాల్వా ఫుడ్డింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని… అది చాలా బాగుంటుందని జోహన్నెస్‌బర్గ్‌లో ఓసారి భారత బౌలర్ జహీర్ ఖాన్ చెప్పడంతో… అక్కడే మాల్వా ఫుడ్డింగ్ ను మొదటిసారి టేస్ట్ చేశానని చెప్పాడు. అప్పటి నుంచి తనకు ఇష్టమైన, అత్యుత్తమమైన ఫుడ్ అదేనని… దాన్ని క్రమం తప్పకుండా ఇష్టంగా తింటానని కోహ్లీ వెల్లడించాడు. ఇక ఇష్టమైన భారతీయ డెజర్ట్ గురించి అడిగినప్పుడు… ఇంట్లో తయారు చేసే గాజర్ హల్వా, రాగి హల్వా అంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు… కోహ్లీ.

అలాగే ఎత్తుకు తగ్గ బరువును మెయింటెయిన్ చేయడం కూడా తన ఫిట్‌నెస్ కు ఓ కారణమని చెప్పాడు… కోహ్లీ. 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉన్న తాను… గత ఎనిమిదేళ్లుగా శరీరం బరువును 74.5 కిలోల నుంచి 75 కిలోల మధ్య మెయింటెయిన్ చేస్తున్నానని… బరువు పెరగకుండా చూసుకోవడం కూడా తాను ఫిట్ గా ఉండటానికి కారణమన్నాడు… కోహ్లీ.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News