BigTV English

Lice remove tips:పేలు, చుండ్రులతో ఇబ్బంది పెడుతున్నారా? అమ్మమ్మల కాలంనాటి టిప్స్ ప్రయత్నించి చూడండి

Lice remove tips:పేలు, చుండ్రులతో ఇబ్బంది పెడుతున్నారా? అమ్మమ్మల కాలంనాటి టిప్స్ ప్రయత్నించి చూడండి

స్కూల్ కెళ్లే పిల్లలకు జుట్టులో పేలు పట్టడం సహజం. పేలుతో పాటు, అవి పెట్టే గుడ్లతో జుట్టు నిండిపోతుంది. వీటివల్ల చుండ్రు కూడా వచ్చేస్తుంది. పిల్లలు చదువుపైన ఏకాగ్రత పెట్టలేక తలపై గోక్కుంటూనే ఉంటారు. కొన్ని ఇంటి నివారణ ద్వారా వాటిని వదిలించుకోవచ్చు. పేలను వదిలించుకోవడానికి అమ్మమ్మలు నాటి చిట్కాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మార్కెట్లో వివిధ రకాల షాంపులు, మందులు అందుబాటులో ఉన్నాయి. కొన్నిసార్లు అవి పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపించవచ్చు. కాబట్టి కొన్ని ఇంటి నివారణల సహాయంతోనే పేలను వదిలించుకోవడం ఉత్తమమైన ఆలోచన.


వేపాకుల నీటితో
పురాతన కాలంలో వేప ఆకుల నీటితో పేలను వదిలించుకునేవారు. ఇది అత్యంత ప్రభావంతంగా పనిచేసేది. దీనికోసం 20 నుంచి 25 వేపాకులను నీటిలో వేసి బాగా చల్లార్చేవారు. ఆ నీటిని స్ప్రే బాటిల్ లో వేసి తలపై బాగా స్ప్రే చేసేవారు. అరగంట పాటు అలా వదిలేసి తర్వాత శుభ్రంగా కడుక్కునేవారు. ఇలా చేయడం వల్ల పేలు పేల గుడ్లు, చుండ్రు వంటివి తొలగిపోతాయని చెబుతారు.

కొబ్బరి నూనెతో కర్పూరం
పేలను, పేలు పెట్టిన గుడ్లను తొలగించడానికి మరొక ప్రభావంతమైన మార్గం కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని వేసి రాయడం. అలా కొబ్బరి నూనె కర్పూరం పొడి కలిపి దాన్ని తలకు పట్టించి గంటపాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత జుట్టును పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇది పేలను చంపుతుంది. అలాగే మెంతులు నిమ్మకాయతో చేసే ప్రయత్నం కూడా మంచి ఫలితాలను ఇవ్వచ్చు. ఇందుకోసం రాత్రిపూట మీరు ఒకటి లేదా రెండు స్పూన్ల మెంతులను నానబెట్టాలి. ఉదయం లేచి వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్టులో నిమ్మకాయ రసాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్టును తల మొత్తం బాగా పట్టించాలి. మాడుకు తగిలేలా రాయాలి. అలా అరగంట పాటు వదిలేసి జుట్టును శుభ్రం చేసుకోవాలి. అంతే పేలు, పేలు పెట్టిన గుడ్లు అన్నీ పోతాయి.


వెనిగర్ తో…
వెనిగర్ స్ప్రే కూడా పేలపై ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు ఒక కప్పు గోరువెచ్చని నీటిని తీసుకొని రెండు చెంచాల వెనిగర్ ను అందులో వేయాలి. అలాగే ఒక చెంచా ఉప్పును కూడా వేయాలి. ఆ మొత్తాన్ని తల మూలాలకు తగిలేలా రాసుకోవాలి. పది నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత దువ్వుకుంటే పేలన్ని పడిపోతాయి. తరచూ ఇలా చేయడం వల్ల పేర్లు పట్టే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.

ఉల్లిపాయ రసం కూడా పేలను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుంది. కాబట్టి ఇది పేలపై విషంలా పనిచేస్తుంది. అరగంట పాటు ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించి వదిలేయాలి. ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇలా చేయడం వల్ల తల పరిశుభ్రంగా మారుతుంది.

టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా పేలు, పేలు పెట్టిన గుడ్లను వదలగొడతాయి. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె లేదా ఆలీవ్ నూనెలో నాలుగు నుండి ఐదు చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపండి. దాన్ని తలకు బాగా పట్టించి రాత్రంతా అలా వదిలేయండి. ఇది ఉదయం లేచి తేలికపాటి షాంపూతో స్నానం చేయండి. ఇది ఎంతో ప్రభావంతంగా పనిచేసే సింపుల్ చిట్కా.

Related News

OTT Movie : ప్రేయసి ఇంట్లో సీక్రెట్ కెమెరాలు… లవ్ ముసుగులో అమ్మాయికి నరకం… రకుల్ కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

Big Stories

×