E-Paper
Advertisement

Virat kohli : దక్షిణాఫ్రికా మ్యాచ్ లోనూ షేక్ హ్యాండ్ వివాదం..వాళ్ళ కోచ్ పరువు తీసిన కోహ్లీ.. రివేంజ్ అదిరిపోయిందిగా

Virat kohli : దక్షిణాఫ్రికా మ్యాచ్ లోనూ షేక్ హ్యాండ్ వివాదం..వాళ్ళ కోచ్ పరువు తీసిన కోహ్లీ.. రివేంజ్ అదిరిపోయిందిగా
Advertisement

Virat kohli : సాధారణంగా ఈ మ‌ధ్య కాలంలో టీమిండియా క్రికెట‌ర్ల‌కు షేక్ హ్యాండ్ వివాదం ప‌రిపాటిగా మారింది. ముఖ్యంగా ఆసియా క‌ప్ స‌మ‌యంలో టీమిండియా ఆట‌గాళ్లు పాకిస్తాన్ తో జ‌రిగిన ఏ మ్యాచ్ స‌మ‌యంలో కూడా పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌కు షేక్ హ్యాండ్ ఇవ్వ‌లేదు. షేక్ హ్యాండ్ ఇవ్వ‌క‌పోవ‌డంతో పాకిస్తాన్ ఆట‌గాళ్లు అప్గానిస్తాన్ తో జ‌రిగిన మ్యాచ్ లో బాయ్ కాట్ చేసేందుకు ప్లాన్ చేసినా.. న‌ష్టం జ‌రుగుతుంద‌ని హోట‌ల్ నుంచి ఆల‌స్యంగా వ‌చ్చారు. దీంతో మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది. టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ప్ర‌తీ మ్యాచ్ విష‌యంలో ఇలాంటి సంఘ‌ట‌నే చోటు చేసుకుంది. తాజాగా మ‌రోసారి ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. కానీ అది ఆట‌గాళ్లంద‌రికి కాదు. కేవ‌లం ఒకే ఒక్క ఆట‌గాడు మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వ‌కుండా వివాదంలో నిలిచాడు.

Also Read : CM Revanth Reddy: మెస్సీ తో ఫుట్ బాల్ మ్యాచ్..బ‌రిలోకి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సౌతాఫ్రికా కోచ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

Advertisement

ఇటీవ‌ల టెస్ట్ సిరీస్ ముగిసిన స‌మ‌యంలో సౌతాఫ్రికా కోచ్ శుక్రీ కోన్రాడ్ ఓ సంచ‌ల‌న ప్ర‌క‌టన చేసిన విష‌యం తెలిసిందే. అత‌ను చేసిన వ్యాఖ్య‌లు భార‌త క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. అస‌లు ఆయ‌న ఏమ‌న్నాడంటే… టెస్ట్ ముగిసిన త‌రువాత హెడ్ కోచ్ ని ఓ మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్నించ‌గా.. మీరు ముందే డిక్లెర్ ఎందుకు ఇవ్వ‌లేదు..? ఆల్రెడీ టార్గెట్ పెద్ద‌గానే ఉంది క‌దా..? అని ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌శ్న‌కి సౌతాఫ్రికా హెడ్ కోచ్ శుక్రీ కోన్రాడ్ మాట్లాడుతూ భార‌త జ‌ట్టు మైదానంలో ఎక్కువ స‌మ‌యం గ‌డ‌పాల‌ని మేము కోరుకున్నాం. వారిని మోకాళ్ల పైకి తీసుకురావాల‌నుకున్నాం. అందుకే రెండో ఇన్నింగ్స్ ని ఆల‌స్యంగా డిక్లెర్ చేశాం. చాలా సేపు వారిని క్రీజ్ లో ఉంచేలా చేసి.. చివ‌రికీ వారిని మా ముందు సాష్టాంగ‌ప‌డేలా చేయ‌డం కోసం ఈ ఇన్నింగ్స్ ని ఆల‌స్యంగా డిక్లెర్ చేశాం. వాళ్లు రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయాలి. కానీ ఫ‌లితం మాకు అనుకూలంగా రావాలి. చివ‌రి రోజు చివ‌రి నిమిషం వ‌ర‌కు వాళ్లు పోరాడుతూనే ఉండాలి. చివ‌రికీ వారిపై మాది పై అవుతుంది అని అన్నారు.

సౌతాఫ్రికా కోచ్ కి కోహ్లీ కౌంట‌ర్

మ‌రోవైపు గ్రోవెల్ అనే ప‌దాన్ని ఉప‌యోగించి ఈ వివాదానికి తెర తీశాడు సౌతాఫ్రికా హెడ్ కోచ్ కోన్రాడ్. గ్రోవెల్ అంటే నేల‌పై ప‌డుకోవ‌డం లేదా పాక‌డం అని అర్థం. ఈ ప‌దాన్ని సౌతాఫ్రికాలో జాతి వివ‌క్ష విష‌యం, క‌రేబియ‌న్ ఆట‌గాళ్ల సంద‌ర్భంలో ఉప‌యోగించారు. సౌతాఫ్రికా కోచ్ చేసిన ఈ కామెంట్స్ పై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గ‌జం డేల్ స్టేయిన్ కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌రోవైపు టీమిండియా మాజీ క్రికెట‌ర్లు కూడా స్పందించారు. ఈ నేప‌థ్యంలో మొన్న జ‌రిగిన వ‌న్డే క్రికెట్ మ్యాచ్ సంద‌ర్భంలో టీమిండియా కీల‌క ఆట‌గాడు విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా కోచ్ కి షేక్ హ్యాండ్ ఇవ్వ‌లేదు. దీంతో సౌతాఫ్రికా కోచ్ కోన్రాడ్ కి విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వ‌కుండా కౌంట‌ర్ ఇచ్చాడ‌ని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ప్ర‌స్తుతం ఈ వార్త వైర‌ల్ గా మారింది.

Advertisement

Also Read : kohli-Rohit : టీమిండియాలో చీలిక…గంభీర్ ను టార్చ‌ర్ చేస్తున్న రోహిత్‌, కోహ్లీ..!

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×