E-Paper
Advertisement

Fire Accident: అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు.. లక్షల్లో ఆస్తి నష్టం!

Fire Accident: అనకాపల్లి జిల్లాలో  భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు.. లక్షల్లో ఆస్తి నష్టం!
Advertisement

Fire Accident: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శారదా నగర్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శారదా నగర్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఒక భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు త్వరగా భవనం మొత్తం వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

అగ్నిమాపక శాఖకు సమాచారం అందించిన స్థానికులు..
అగ్ని ప్రమాదం గురించి వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో భవనంలోని సామాగ్రి కాలిపోవడంతో లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.

Advertisement

Also Read: తీవ్ర విషాదం.. ఒకే రోజు వేర్వేరు కాలేజీల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు..

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం..
ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ప్రాథమికంగా ఈ అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×