E-Paper
Advertisement

Top 20 News: హాంకాంగ్‌ భవన అగ్నిప్రమాదంలో 151 కు చేరిన మృతుల సంఖ్య….GHMC విస్తరణకు గవర్నర్ ఆమోదం

Top 20 News: హాంకాంగ్‌ భవన అగ్నిప్రమాదంలో 151 కు చేరిన మృతుల సంఖ్య….GHMC విస్తరణకు గవర్నర్ ఆమోదం
Advertisement

1. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకార్యకర్తల సమావేశం

గాంధీభవన్‌లో నేడు కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సమావేశానికి హాజరుకానున్నారు. కొత్తగా నియమితులైన డీసీసీలు, పాత డీసీసీలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్‌ సెక్రటరీలతో సమావేశం కానున్నారు.

2. హైదరాబాద్ టూ ఢిల్లీ టూ కొత్తగూడం ప్రయాణించనున్న సీఎం రేవంత్

సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం గాందీభవన్‌లో జరిగే టీపీసీసీ కార్యవర్గ సమావేశానికి హాజరుకానున్నారు. తర్వాత ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆయన భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.

3. టీపీసీసీ కార్యవర్గ సమావేశానికి రేవంత్ రెడ్డి

Advertisement

ఇవాళ టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు గాంధీభవన్‌లో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్‌ సావంత్‌ తదితరులు హాజరవుతారు.

4. GHMC విస్తరణకు గవర్నర్ ఆమోదం

గ్రేటర్‌ హైదరాబాద్‌లోకి శివారులోని పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయాలన్న రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం తెలిపారు. మొత్తం 27 స్థానిక సంస్థలను హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థలో కలిపేందుకు పచ్చజెండా ఊపారు. ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ సంతకం చేయడంతో విలీన ప్రక్రియ ఇక లాంఛనమేనని జీహెచ్‌ఎంసీ తెలిపింది.

5. 129 స్థానాలో ఏకగ్రీవం కానున్న సర్పంచ్ పదవులు

Advertisement

పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తొలివిడత 129 చోట్ల సర్పంచి అభ్యర్థులుగా ఒక్కరు చొప్పున మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో ఈ స్థానాలన్నీ ఏకగ్రీవం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తం 4,231 సర్పంచి పదవులకు గాను.. నామినేషన్ల పరిశీలన అనంతరం 22,330 మంది మిగిలారు.

6. రెండో సారి సమావేశం కానున్న కర్ణాటక లీడర్లు

కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార పంపిణీపై ఇంకా ఊహాగానాలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య విభేదాలున్నాయనే ప్రచారానికి తెరదించేలా…వారం వ్యవధిలోనే వీరిద్దరూ రెండోసారి సమావేశం కానున్నారు.

7. 150 డివిషన్ల నుంచి 310కి పెరగనున్న హైదరాబాద్ మున్సిపాలిటీ

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధి మరింత పెరగనుంది. కొత్త ప్రాంతాల కలయికతో డివిజన్ల సంఖ్య రెట్టింపు కానున్నాయి.ప్రస్తుతం గ్రేటర్‌లో 150 డివిజన్లు ఉండగా.. కొత్తగా 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో డివిజన్ల సంఖ్య 310కి చేరనున్నాయి. ప్రభుత్వం నుంచి ఆర్డినెన్స్‌ వచ్చినవెంటనే కొత్త డివిజన్ల పెంపు ప్రక్రియ ప్రారంభం కానుంది.

8. అనంతసాగర్ గ్రామంలో మరోసారి సర్పంచ్ ఏకగ్రీవం చేసుకున్నారు

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలానికి చెందిన అనంతసాగర్ గ్రామం మరోసారి ఆదర్శంగా నిలిచింది. గ్రామ అభివృద్ధికి, ప్రజల ఐకమత్యానికి నిదర్శనంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకున్నారు. విభేదాలు లేకుండా, అనవసర ఖర్చులు లేకుండా, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, రైతులు అందరూ కలిసికట్టుగా ఏకాభిప్రాయానికి వచ్చారు.

9. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి ఆత్మహత్య

ఉస్మానియా యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓయూలో ఇంజినీరింగ్‌ చదువుతున్న విజ్ఞాన్‌ అనే యువకుడు ఆక్సిజన్‌ పార్క్‌లో చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుడి స్వస్థలం హుజూరాబాద్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

10. డిసెంబర్ 5న ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 5న పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఇద్దరూ తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరై పిల్లల భవిష్యత్తుకు సహకరించాలని కోరారు.

11.చదువుకున్న యువకుడిని సర్పంచ్ గా ఎన్నుకున్న ఉప్పలపహాడ్ గ్రామస్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ఉప్పలపహాడ్ గ్రామస్తులు ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో చారిత్రక నిర్ణయం తీసుకుంది. ప్రతీసారి సాధారణ ఎన్నికలు జరిగే ఈ గ్రామంలో, ఎనిమిదోసారి జరిగే ఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకున్నారు. గ్రామ అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే, చదువుకున్న యువకుడు పాలించాలని భావించిన గ్రామస్తులు పార్టీలకు అతీతంగా డిగ్రీ పట్టభద్రుడు చిన్నం బీరప్పను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

12. డిజిటల్ అరెస్ట్ స్కాం కేసును సిబిఐకి అప్పగించిన సుప్రీమ్ కోర్ట్

డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై దర్యాప్తు ప్రారంభించాలని సిబిఐని ఆదేశించింది సుప్రీంకోర్టు. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై దర్యాప్తుకు.. సీబీఐ ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.

13. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు

రాబోయే రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు మరిన్ని ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 152 ఆర్టీసీ అద్దె బస్సులను మండల మహిళా సమాఖ్యలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. మహిళను ఆర్దికంగా బ‌తోపేతం చేసే లక్ష్యంతో మరో 448 అద్దె బ‌స్సుల‌ను మహిళా సంఘాలకే అప్పగించే ప్రక్రియ చివరి దశలో ఉంది.

14. హాంకాంగ్‌ భవన అగ్నిప్రమాదంలో 151 కు చేరిన మృతుల సంఖ్య

భారీ అగ్నిప్రమాదం సంభవించిన హాంకాంగ్‌ భవన సముదాయంలో ఇంకా మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య 151కి పెరిగింది. ఇంకా 104 మంది ఆచూకీ తెలియలేదు. ప్రమాద బాధితుల కుటుంబాలను ఆదుకోవడానికి పెద్దఎత్తున జనం ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత మేర సాయం అందజేస్తున్నారు. ఇలా ఇప్పటిదాకా సమకూరిన మొత్తం దాదాపు 1029 కోట్లు అని అధికారులు తెలిపారు.

15. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వర్ష ఆత్మహత్య

హైదరాబాద్ బాచుపల్లి పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న వర్ష ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ రూమ్ లోని ఫ్యాన్ కి ఉరి వేసుకొని వర్ష చనిపోయింది. హాస్టల్ సిబ్బంది సమాచారంతో బాచుపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు హాస్టల్ నిర్వాహకుల ఒత్తిడే కారణమంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

16. అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు

పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. వడ్డెంగుంటలో రూ. 36 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రావులాపురం నుంచి పలుకూరు వరకు రూ. 4.50 కోట్లతో తారు రోడ్డు పనులకు, అలాగే వెల్లటూరులో రూ. 70 లక్షల JJM నిధులతో ఇంటింటికి కుళాయి పథకానికి శంకుస్థాపన చేశారు.

17. శ్రీలంక తూఫాన్ లో చికుకపోయిన భారతీయులు తిరిగి వచ్చేసారు

దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో చిక్కుకుపోయిన భారతీయుల ఆఖరి బృందాన్ని కేంద్ర ప్రభుత్వం కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి చేర్చింది. ఆపరేషన్‌ సాగర్‌ బంధులో భాగంగా శ్రీలంకలో సహాయక చర్యలను భారత్‌ ముమ్మరం చేసింది. చేతక్‌ హెలికాప్టర్‌లు ఎంతో మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

18. పార్లమెంట్ సమావేశాలు సేవ కోసం, నాటకానికి కాదు: నరేంద్ర మోడీ

పార్లమెంటు అనేది సేవల అందజేతకు తప్పిస్తే.. నాటకాలకు వేదిక కాదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు. శీతాకాల సమావేశాలో మోదీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటములతో నిస్పృహలో ఉన్న విపక్షాలు ఆ కోపాన్ని తీర్చుకునేందుకు పార్లమెంటును ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు.

19. భారత మహిళల హాకీ జట్టు చీఫ్‌ కోచ్‌ రాజీనామా

భారత మహిళల హాకీ జట్టు చీఫ్‌ కోచ్‌గా హరేంద్ర సింగ్‌ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానం సాధించిన భారత జట్టుకు అప్పటి కోచ్‌గా వ్యవహరించిన సోయెర్డ్‌ మరైన్‌ తిరిగి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. హరేంద్ర సింగ్‌ 2024 ఏప్రిల్‌లో కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు.

20. రెండేళ్లు పూర్తిచేసుకున్న నాగ చైతన్య ‘దూత’

నిజాయతీగా పని చేస్తే ప్రేక్షకులకు తప్పకుండా చేరువవుతారని నటుడు నాగచైతన్య అభిప్రాయపడ్డారు. ఆయన తొలి వెబ్‌సిరీస్‌ ‘దూత’ ఈ విషయాన్ని రుజువు చేసిందన్నారు. ఈ సిరీస్‌కు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆయన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×