E-Paper
Advertisement

Kohli-Bavuma: బవుమా ముందు కోహ్లీ కుప్పి గంతులు.. ఐసీసీ వేటు ?

Kohli-Bavuma: బవుమా ముందు కోహ్లీ కుప్పి గంతులు.. ఐసీసీ వేటు ?
Advertisement

Kohli-Bavuma: సౌత్ ఆఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో గెలుపొందిన టీమిండియా.. రాయిపూర్ వేదికగా బుధవారం రోజు జరిగిన రెండవ వన్డే మ్యాచ్ లో మాత్రం దక్షిణాఫ్రికాపై ఓడిపోయింది. తద్వారా మూడు మ్యాచ్ ల సిరీస్ ని ప్రస్తుతానికి 1-1 తో సమం చేసింది సౌత్ ఆఫ్రికా. ఇక కీలకమైన మూడవ వన్డే మ్యాచ్ డిసెంబర్ 6 శనివారం రోజున జరగనుంది.

Also Read: Ruturaj Gaikwad: ఇండియాకు శాపంగా మారిన రుతురాజ్..సెంచ‌రీ చేస్తే ద‌రిద్ర‌మే

Advertisement

అయితే సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండవ వన్డేలో విరాట్ కోహ్లీ తన 53వ వన్డే సెంచరీని పూర్తి చేశాడు. ఈ సెంచరీతో విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి విపరీతమైన ప్రశంసలు దక్కాయి. ఈ సెంచరీతో సౌత్ ఆఫ్రికా పై అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు కోహ్లీ. గత 33 వన్డేలలో దక్షిణాఫ్రికాపై 69.64 సగటుతో 1,741 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో సౌత్ఆఫ్రికా పై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన రికార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు.

 

టెంబా బవుమాను ర్యాగింగ్ చేసిన కోహ్లీ:

Advertisement

సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో వింటేజ్ విరాట్ కోహ్లీ దర్శనమిచ్చాడు. వరుసగా రెండు వన్డే మ్యాచ్లలో సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. తన కెరీర్ లో అంతర్జాతీయ క్రికెట్ లో 84వ సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కి చెందిన 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డుని అందుకునే దిశగా కోహ్లీ దూసుకెళ్తున్నాడు. అయితే కేవలం బ్యాటింగ్ లో మాత్రమే కాకుండా.. ఫీల్డింగ్ లోను కోహ్లీ తన పాత ఆటిట్యూడ్ తో కనిపించాడు. గతంలో లాగా ఆట పట్టించడం, అగ్రేషన్ చూపించడం, ఆటగాళ్లను ఉత్తేజపరచడం విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ లో కనిపించాయి.

రెండవ వన్డేలోని 5వ ఓవర్ లో అర్షదీప్ సింగ్ వేసిన బంతికి క్వింటన్ డికాక్ అవుట్ అయిన తర్వాత.. కెప్టెన్ టెంబా బవుమా బ్యాటింగ్ కి వచ్చాడు. ఆ సమయంలో ఫీల్డింగ్ లో ఉన్న విరాట్ కోహ్లీ నాగిన్ డాన్స్ చేస్తూ కనిపించాడు. ఈ సన్నివేశం కేమెరాలలో పడడంతో.. ఈ క్లిప్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఈ వీడియో చూసిన క్రీడాభిమానులు కోహ్లీని ఎంతగానో మిస్సయ్యామని.. ఈ సిరీస్ లో మళ్లీ పాత విరాట్ కోహ్లీని చూసామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే బవుమా ముందు విరాట్ కోహ్లీ వేసిన కుప్పిగంతులతో ఐసీసీ కోహ్లీ పై వేటు వేస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక వరుస సెంచరీలతో, ఎనర్జిటిక్ ఫీల్డింగ్ తో విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.

Also Read: Ind vs SA 2nd ODI: ఫస్ట్‌‌ బాల్ కే 10 పరుగులు సాధించిన య‌శ‌స్వి జైష్వాల్‌

 

సిరీస్ ని సొంతం చేసుకుంటామంటున్న బవుమా:

రెండవ వన్డే మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేదించి విజయం సాధించడంపై సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తమ బ్యాటర్లు అసాధారణంగా ఆడారని, జట్టులోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకున్నారని అన్నాడు. చివరి వన్డే లోను ఇదే ఆట తీరును కొనసాగించి సిరీస్ ని సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. రెండవ వన్డేలో గెలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్ నమ్మశక్యంగా లేదని.. ఇది ఓ రికార్డు చేదన అని తను అనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ గెలుపు తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసిందని చెప్పుకొచ్చాడు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by @Cricket Daily (@cricknxt_)

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×