E-Paper
Advertisement

Ruturaj Gaikwad: ఇండియాకు శాపంగా మారిన రుతురాజ్..సెంచ‌రీ చేస్తే ద‌రిద్ర‌మే

Ruturaj Gaikwad: ఇండియాకు శాపంగా మారిన రుతురాజ్..సెంచ‌రీ చేస్తే ద‌రిద్ర‌మే
Advertisement

Ruturaj Gaikwad: రాయిపూర్ లో బుధవారం భారత్ – సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండవ వన్డేలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా టాస్ గెలిచి భారత జట్టును ముందుగా బ్యాటింగ్ కి ఆహ్వానించాడు.

Also Read: Ind vs SA 2nd ODI: ఫస్ట్‌‌ బాల్ కే 10 పరుగులు సాధించిన య‌శ‌స్వి జైష్వాల్‌

Advertisement

ఈ క్రమంలో బ్యాటింగ్ చేపట్టిన భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ సెంచరీలు చేయడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయినప్పటికీ సౌత్ ఆఫ్రికా జట్టు 49.2 ఓవర్లలో 362 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది. దీంతో సిరీస్ ని సౌత్ ఆఫ్రికా 1-1 తో సమం చేసింది.

 

రుతురాజ్ సెంచరీ చేస్తే దరిద్రమేనా..?:

Advertisement

దాదాపు రెండు సంవత్సరాల విరామం తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో నాలుగవ స్థానంలో బ్యాటింగ్ కి దిగాడు. అయితే ఈ మొదటి వన్డేలో మొత్తంగా 14 బంతులు ఎదుర్కొన్న ఈ మహారాష్ట్ర ఆటగాడు.. కేవలం ఎనిమిది పరుగులకే పెవిలియన్ చేరాడు. గైక్వాడ్ గాల్లోకి లేపిన బంతిని సౌత్ ఆఫ్రికా యువ ఆటగాడు డేవాల్డ్ బ్రేవిస్ అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు. అయితే ఈ తొలి వన్డేలో భారత జట్టు 17 పరుగుల తేడాతో సౌత్ఆఫ్రికా పై విజయం సాధించింది. ఇక తొలి వన్డేలో విఫలం కావడంతో రుతురాజ్ పై వేటు వేస్తారనే ఊహాగానాలు వినిపించాయి.

కానీ మేనేజ్మెంట్ రుతురాజ్ కి మరో అవకాశం ఇచ్చింది. రెండవ వన్డేలో రుతురాజ్ ని ఎంపిక చేయడంతో.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రెండవ వన్డేలో దూకుడు ప్రదర్శించిన రుతురాజ్.. 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా వన్డేల్లో తన మొదటి సెంచరీని నమోదు చేశాడు. ఈ రెండవ వన్డేలో మొత్తంగా 83 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్.. 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 105 పరుగులు చేశాడు. అయితే రుతురాజు మొదటి సెంచరీ చేసిన ఈ వన్డేలో భారత జట్టు ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో రుతురాజ్ సెంచరీ చేస్తే ఆ జట్టు ఓడిపోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

రుతురాజు సెంచరీ చేస్తే జట్టు ఓడిపోవాల్సిందేనా..?:

రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేసిన ప్రతి సమయంలోనూ ఆ జట్టు ఓటమిపాలైందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. టి-20 క్రికెట్ ఫార్మాట్ లో రుతురాజు గైక్వాడ్ డెబ్యుట్ సెంచరీ చేసిన సమయంలో భారత జట్టు ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియాపై ఈ సెంచరీ సాధించాడు రుతురాజ్. 2023 నవంబర్ లో జరిగిన మూడవ టి-20 మ్యాచ్ లో కేవలం 52 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కానీ ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయింది.

Also Read: Harshit Rana: గంభీర్‌ కొడుకు హ‌ర్షిత్ రాణా దూల తీర్చిన ఐసీసీ.. ఈ వెధ‌వ ప‌నులు త‌గ్గించుకో అంటూ

ఐపీఎల్ లో కూడా 2024లో ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేశాడు రుతురాజ్. కేవలం 56 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కానీ ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. ఇక తాజాగా సౌత్ ఆఫ్రికా తో జరిగిన రెండవ వన్డేలో తన మొదటి వన్డే సెంచరీని పూర్తి చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో కూడా భారత జట్టు ఓటమిని చవిచూడడంతో రుతురాజ్ ఇండియా కు శాపంగా మారాడని.. అతడు సెంచరీ చేస్తే ఇక దరిద్రమే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Variation Venky (@they_call_him_vv)

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×