E-Paper
Advertisement

Sangareddy News: కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు.. సంగారెడ్డి వ్యవహారం, జూనియర్ ఇంటిపై 50 మంది విద్యార్థులు

Sangareddy News: కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు.. సంగారెడ్డి వ్యవహారం, జూనియర్ ఇంటిపై 50 మంది విద్యార్థులు
Advertisement

Sangareddy News: తెలంగాణలో వరుస ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు పెద్దగా కనిపించని ఈ వ్యవహారం, ఇప్పుడు క్రమంగా రెట్టింపు అయినట్టు కనిపిస్తోంది. గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల వంతైంది. ఇలా ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో ర్యాగింగ్ వ్యవహారాలు జోరుగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. తాజాగా సంగారెడ్డి మెడికల్ కాలేజీ స్టూడెంట్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

ప్రభుత్వ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు

Advertisement

సంగారెడ్డిలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగింది. బుధవారం రాత్రి ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సంగారెడ్డి పట్టణానికి చెందిన ఓ విద్యార్థి మెడికల్ కాలేజీలో ఫస్టియర్ చదువుతున్నాడు.

Advertisement

మంగళవారం రాత్రి కళాశాలలో ఓ వేడుక సందర్భంగా దుస్తులు విప్పేసి డ్యాన్స్ చేయాలని జూనియర్ విద్యార్థిపై సీనియర్లు ఒత్తిడి చేశారు. ఈ విషయాన్ని సదరు విద్యార్థి ఫ్యామిలీ సభ్యులకు తెలిపాడు. దీనిపై ఆగ్రహించిన అతడి సోదరుడు, మహబూబ్‌‌సాగర్‌ చెరువు వద్దకు రావాలని వారికి కబురు పెట్టాడు. వెంటనే ఇద్దరు సీనియర్లు అక్కడికి చేరుకున్నారు.

జూనియర్ ఇంటిపైకి 50 మంది విద్యార్థులు

ఈలోగా వారితో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలియగానే కళాశాల నుంచి సుమారు 50 మంది సీనియర్లు శాంతినగర్‌కు జూనియర్ విద్యార్థి ఇంటికి చేరుకున్నారు. వారి ఇంటిపై దాడికి యత్నించారు.  ఈ ఘటనలో జూనియర్‌ విద్యార్థి తండ్రికి గాయాలు అయ్యాయి. ఆయన్ని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు ఈ వ్యవహారంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకుని ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కాలేజీ అధికారులు, ర్యాగింగ్‌ కమిటీ సభ్యులతో పోలీసులు చర్చలు జరిపారు. మొత్తానికి ర్యాగింగ్ వ్యవహారం కాస్త పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. మరి పోలీసులు.. విద్యార్థుల మధ్య ఏ విధంగా రాజీ చేస్తారో చూడాలి.

ALSO READ: తెలంగాణ పోలీసు కమిషనరేట్ వెబ్ సైట్ హ్యాక్

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×