E-Paper
Advertisement

Ind vs SA 2nd ODI: ఫస్ట్‌‌ బాల్ కే 10 పరుగులు సాధించిన య‌శ‌స్వి జైష్వాల్‌

Ind vs SA 2nd ODI:  ఫస్ట్‌‌ బాల్ కే 10 పరుగులు సాధించిన య‌శ‌స్వి జైష్వాల్‌
Advertisement

Ind vs SA 2nd ODI: చతిస్గడ్ రాయిపూర్ లోని షాహిద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న రెండవ వన్డే మ్యాచ్ లోని తొలి ఇన్నింగ్స్ లో అసాధారణ దృశ్యం ఆవిష్కృతమైంది. ఆట ప్రారంభం కాగానే దక్షిణాఫ్రికా బౌలర్ నంద్రే బర్గర్ వేసిన ఓవర్ లో ఏకంగా ఒక్క బంతికే 10 పరుగులు వచ్చాయి. బర్గర్ వేసిన మొదటి ఓవర్ లో యశస్వి జైష్వాల్ తొలి బంతికి పోర్ కొట్టాడు.

Also Read: Ind vs SA 2nd ODI: దక్షిణాఫ్రికాపై కోహ్లీ, రుతురాజ్ సెంచరీలు.. భారీ స్కోర్ దిశగా టీమిండియా

Advertisement

ఆ తరువాత బంతిని వైడ్ వేయగా.. ఆ బంతిని వికెట్ కీపర్ ఆపలేకపోవడంతో బౌండరీ వెళ్ళింది. ఆ తర్వాత బంతిని బర్గర్ మళ్ళీ వైడ్ వేశాడు. దీంతో ఒక్క బాల్ కి పది పరుగులు { 4 రన్స్ + 5 వైడ్ రన్స్ + 1 వైడ్} లభించాయి. ఈ యువ పేసర్ బర్గర్ కి ఇది ఓ పీడకల లాంటి ఆరంభం. అయితే ప్రారంభంలోనే ఈ విధమైన భారీ పరుగులు రావడంతో భారత బ్యాటర్లు మరింత ఆత్మ విశ్వాసంతో పరుగులు చేస్తున్నారు.

 

మరోసారి టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా:

Advertisement

రెండవ వన్డే లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. తద్వారా భారత్ వన్డేల్లో వరుసగా 20వ సారి టాస్ ఓడింది. ఇక ఈ మ్యాచ్ తో తిరిగి జట్టులో చేరిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబ బవుమా మాట్లాడుతూ.. ” వికెట్ పాతబడే కొద్దీ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. తేమ ప్రభావం కూడా ఉంటుంది. అందుకే మేము మొదట బౌలింగ్ ఎంచుకున్నాం. కానీ పిచ్ స్వభావం ఎలా ఉండబోతుందో ముందుగా చెప్పడం కష్టమే. ఈ మ్యాచ్ లో 3 మార్పులతో బరిలోకి దిగుతున్నాం. ఈ మ్యాచ్ మాకు ఎంతో కీలకం ” అని తెలిపాడు.

 

చాలా కాలంగా టాస్ గెలవలేకపోతున్నాం:

20వ సారి టాస్ ఓడిన అనంతరం టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కే ఎల్ రాహుల్ మాట్లాడుతూ.. “సుదీర్ఘకాలంగా మేము టాస్ గెలవలేక పోతున్నాం. ఏది ఏమైనా గత మ్యాచ్ లో మా ప్రదర్శన అద్భుతంగా సాగింది. దక్షిణాఫ్రికా కూడా గట్టి పోటీ ఇచ్చింది. పరుగులు సాధించడంతో పాటు.. వరుస విరామాలలో వికెట్లు తీస్తేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలం. ఈ మ్యాచ్ కి మా తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు” అని తెలిపాడు.

Read Also: Harshit Rana: గంభీర్‌ కొడుకు హ‌ర్షిత్ రాణా దూల తీర్చిన ఐసీసీ.. ఈ వెధ‌వ ప‌నులు త‌గ్గించుకో అంటూ

ఇక ఈ రెండవ వన్డే లో రుతురాజ్ గైక్వాడ్ – విరాట్ కోహ్లీ అదరగొడుతున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ {22} మరొకసారి నిరాశపరచగా.. రోహిత్ శర్మ కూడా 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. కానీ రుతురాజ్ – కోహ్లీ మాత్రం సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడమే కాకుండా ఇద్దరు సెంచరీలు చేశారు. ప్రస్తుతం 42 ఓవర్ల వద్ద భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ {102}, రుతురాజ్ {105} సెంచరీలు చేశారు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×