E-Paper
Advertisement

Horror Thriller OTT : మైండ్ బెండింగ్ థ్రిల్లర్ మావా… రాత్రి మొదలు పెడితే తెల్లారి వరకు… చూస్తే గజగజా వణికిపోవాల్సిందే

Horror Thriller OTT : మైండ్ బెండింగ్ థ్రిల్లర్ మావా… రాత్రి మొదలు పెడితే తెల్లారి వరకు… చూస్తే గజగజా వణికిపోవాల్సిందే
Advertisement

Horror Thriller OTT : తక్కువ బడ్జెట్‌తో కొన్ని థ్రిల్లర్ సినిమాలు సీట్ ఎడ్జ్ కు తీసుకెళ్తుంటాయి. దర్శకుల ప్రతిభతో పాటు, టెక్నీషియన్స్ వర్క్ కూడా ఈ సినిమాల విజయంలో కీలక పాత్ర ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఒక ఫ్యాక్టరీలో నైట్ షిఫ్ట్ చేసే ఒంటరి మహిళను చంపడానికి కొంత మంది సైకోలు వస్తారు. ఆ తరువాత స్టోరీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఫ్యాక్టరీసెట్టింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ చూస్తుంటే పెద్ద సినిమా చూస్తున్నంత కిక్కు ఇస్తుంది. ఎక్కువగా గ్రాఫిక్స్ నమ్ముకోకుండా, రియలిస్టిక్ యాక్షన్ సీన్స్‌తో సినిమాను నడిపించారు. ఇందులో టెర్రాజినో అనే హీరోయిన్ ఒక సాదాసీదా పనిమనిషిలా కనిపిస్తూనే, ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఒక పులిలా ఎలా మారిందో ఆమె నటనలో అదరగొట్టేసింది.

ఎక్కడ చూడవచ్చు?

ఈ అమెరికన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘హంట్ హర్, కిల్ హర్’ (Hunt Her, Kill Her). 2022లో వచ్చిన ఈ సినిమాకు గ్రెగ్ స్విన్సన్, ర్యాన్ థియేసెన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వీళ్ళు చాలా ఉత్కంఠంగా తీశారు. కెమెరా మూమెంట్స్ కూడా మనం అక్కడే ఉండి చూస్తున్నట్టుగా అనిపిస్తాయి. ఈ సినిమాకు ముందుగా ‘నైట్ షిఫ్ట్’ (Night Shift) అని పేరు పెట్టారు. కానీ ఆ పేరు కంటే ‘హంట్ హర్, కిల్ హర్’ అనే పేరు అయితేనే ప్రేక్షకులకు కరెక్ట్‌గా కనెక్ట్ అవుతుందని లాస్ట్ మినిట్‌లో మార్చేశారు. సినిమా మొత్తం నటాలీ టెర్రాజినో అనే హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. Amazon Prime Video, Tubi ఓటీటీలలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

తన చిన్నారి కూతురిని పోషించుకోవడం కోసం కరెన్ (నటాలీ టెర్రాజినో) అనే ఒంటరి మహిళ, ఒక మారుమూల ఫర్నిచర్ ఫ్యాక్టరీలో నైట్ షిఫ్ట్ జానిటర్ గా ఉద్యోగంలో చేరుతుంది. ఆ ఫ్యాక్టరీలో ఆమెకు అది మొదటి రాత్రి. అది ఊరికి దూరంగా ఉన్న ఒక ఎడారి లాంటి చోటు. మొదటి రోజు డ్యూటీ కదా అని ఆమె పనిలో పడితే, అర్ధరాత్రి వేళ ముఖాలకు మాస్కులు వేసుకున్న నలుగురైదుగురు రౌడీలు ఆ ఫ్యాక్టరీలోకి చొరబడతారు. వాళ్ల ప్లాన్ ఒక్కటే.. ఆ ఫ్యాక్టరీలో ఉన్న ఆ ఒక్క ఆడదాన్ని వేటాడి చంపేయాలి.

అంత పెద్ద ఫ్యాక్టరీలో, కరెంట్ సరిగ్గా లేని చీకటి గదుల్లో ఆ రౌడీలు ఆమె కోసం వేట మొదలుపెడతారు. పాపం ఆమె భయంతో వణికిపోతూ, వాళ్ల కంట పడకుండా మూలమూలల దాక్కుంటుంది. ఫోన్ లేదు, సాయం చేసే మనిషి లేడు, బయట పడదామంటే తలుపులన్నీ లాక్ చేసి ఉంటాయి. ఆ రౌడీలు ఆమెను పట్టుకోవడానికి కత్తులు, గొడ్డళ్లతో వెంటాడుతుంటే, చూసే మనకే గుండె ఆగిపోయినంత పనవుతుంది. చివరికి ఆ రాత్రి గడిచేసరికి ఆమె బతికిందా ? ఆ ముసగు మనుషులకు బలవుతుందా ? అసలు ఆమెను ఎందుకు చంపడానికి వచ్చారు ? అనేది అసలు సిసలైన క్లైమాక్స్.

Advertisement

Read Also : ఓటీటీని షేక్ చేస్తున్న సూపర్ హీరో సిరీస్ సీజన్ 2… ఈసారి అబ్బురపరిచే విన్యాసాలు

Related News

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

Big Stories

Advertisement
×