Rajat Patidar Catch Controversy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 40 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇక ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Gujarat Titans vs Royal Challengers Bengaluru) మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ అహ్మదాబాదులోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే ఇందులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ (rajat patidar catch ) ఔట్ అయిన విధానంపై సోషల్ మీడియాలో వివాదం రాజుకుంది. రజత్ పాటిదార్ ఇచ్చిన ఓ క్యాచ్ ను అందుకునే క్రమంలో జాసన్ హోల్డర్ డైవ్ చేశాడు. అనంతరం క్యాచ్ పట్టుకొని… బంతిని నేలకు తగిలించాడు. అయినప్పటికీ రజత్ పాటిదార్ ను ఔట్ అంటూ ప్రకటించారు అంపైర్లు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఇవాళ జరిగిన మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ రజత్ పాటిదార్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అర్షద్ ఖాన్ వేసిన ఓ బంతిని షాట్ ఆడబోయి… క్యాచ్ ఇచ్చాడు రజత్ పాటిదార్. ఈ క్రమంలోనే జాసన్ హోల్డర్ క్యాచ్ అందుకొని… బంతిని నేలకు తగిలించాడు. అయినప్పటికీ అంపైర్ అవుట్ ఇవ్వడం పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు డగౌట్ చాలా సీరియస్ అయింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అంపైర్లతో గొడవ కూడా పెట్టుకున్నాడు. నేలకు బంతి తగిలినప్పటికీ.. ఎలా ఔట్ ఇస్తారంటూ అంపైర్ ను నిలదీసే ప్రయత్నం చేశాడు.
గతంలో మహేంద్ర సింగ్ ధోని కూడా ఇలాగే మ్యాచ్ మధ్యలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అచ్చం అలాగే రజత్ పటిదార్ ను గ్రౌండ్ లోనే ఆపేసి.. అంపైర్ తో గొడవకు దిగాడు విరాట్ కోహ్లీ. అయినప్పటికీ అంపైర్లు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇక చేసేదేమీ లేక పెవిలియన్ చేరిపోయాడు రజత్ పటిదార్. అటు అంపైర్ల నిర్ణయంపై విరాట్ కోహ్లీ కూడా అసహనం వ్యక్తం చేశాడు. దీంతో ఈ సంఘటనపై వివాదం రాజుకుంది. ఇది ఇలా ఉండగా వికెట్ కోల్పోయేసరికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ 15 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేశాడు. అటు ఇప్పటికే 120 కి పైగా పరుగులు చేసిన బెంగుళూరు ఎనిమిది వికెట్లు నష్టపోయింది.
A big moment in the game! 👀
Jason Holder took a diving catch to send Rajat Patidar back, but the RCB camp was not convinced by the call.#IPL2026 #GTvRCBpic.twitter.com/6QBxpJHNCS
— Sportstar (@sportstarweb) April 30, 2026
Controversy in the middle 👀
Virat Kohli and Andy Flower not pleased with the third umpire’s call on Jason Holder’s catch 😬
What do you think — OUT or NOT OUT? 🤔#Cricket #GTvRCB #IPL2026 pic.twitter.com/GVcXLpYASd
— Sportskeeda (@Sportskeeda) April 30, 2026
Out or not out? 👀
What are your thoughts on the third umpire’s decision? The RCB dressing room looks unhappy with the call on Rajat Patidar’s dismissal ❌#Cricket #GTvRCB #IPL2026 pic.twitter.com/kt4zQiFT3a
— Sportskeeda (@Sportskeeda) April 30, 2026