Virender Sehwag : టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో రేపు కీలక మ్యాచ్ జరగనుంది. టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ( Team India vs West Indies) మధ్య సూపర్ 8 మ్యాచ్ నిర్వహించనున్నారు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ( Eden Gardens, Kolkata) ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు గ్రూప్ – 1 నుంచి సెమీఫైనల్ చేరుతుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కు స్ట్రాంగ్ వర్నింగ్ ఇచ్చాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ( Virendra Sehwag). వెస్టిండీస్ బ్యాటర్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశాడు. వెస్టిండీస్ జట్టులో ఒక్కడు నిలబడ్డా చాలు, మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుందని డేంజర్ బెల్స్ పంపించాడు వీరేంద్ర సెహ్వాగ్. వెస్టిండీస్ బ్యాటర్లు కొట్టే సిక్సర్లకు టీమిండియా బౌలర్ల ప్యాంట్లు తడుస్తాయని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇలాంటి నేపథ్యంలో వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరాడు.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ( Team India vs West Indies) మధ్య ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens, Kolkata) వేదికగా రేపు సూపర్ 8 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్. వెస్టిండీస్ లాంటి జట్టుతో ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాడు. వాళ్లను అస్సలు లైట్ తీసుకోకూడదని కోరాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇండియా తో మ్యాచ్ అంటే వాళ్లు కచ్చితంగా రెచ్చిపోయి ఆడతారు.. ఛాన్స్ ఇస్తే వరల్డ్ కప్ కూడా కొట్టేస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించాడు.
గతంలో కార్లోస్ బ్రాత్‌వైట్ ( Carlos Brathwaite) ఏకంగా నాలుగు సిక్సర్లు కొట్టి ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్ పై ఊచకోత కోశాడని గుర్తు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. అప్పుడు తాను కామెంట్రీ బాక్సులో ఉన్నానని.. అతడు కొట్టే సిక్సర్లు చూసి భయపడిపోయానని వెల్లడించారు. అలా వెస్టిండీస్ జట్టులో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా సిక్సర్లు కొడతారు.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి… వాళ్లంటే భయపడి పోవాలి.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. కానీ టెక్నిక్ గా వెస్టిండీస్ బ్యాటర్లను ఎదుర్కొంటే.. కచ్చితంగా టీమిండియా గెలుస్తుందని తెలిపారు.
కార్లోస్ బ్రాత్‌వైట్ ( carlos brathwaite) అంటే 2016 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మాత్రమే అందరికీ గుర్తుకు వస్తుంది. ఆ సమయంలో ఇంగ్లాండ్ ను ఊచ కోత కోశాడు బ్రాత్ వైట్. పది బంతుల్లో 32 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సిక్సర్లు కూడా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఒకే ఒక్క పరుగు తేడాతో ఇంగ్లాండ్ పై వెస్టిండీస్ విజయం సాధించింది. దీంతో ఇంగ్లాండ్ కు నిరాశ ఎదురయింది
Also Read: Abhishek Sharma-Yuvraj Singh: అభిషేక్ శర్మకు ఘోర అవమానం…చెప్పులు చూపించిన యువరాజు
🚨 MASSIVE STATEMENT BY VIRENDRA SEHWAG ON INDIA VS WEST INDIES 🚨
Virendra Sehwag said 🗣️
"You cannot take the West Indies lightly. I’m telling you, when they came to India to play, the West Indies won the World Cup. I remember Carlos Brathwaite hitting those four sixes at… pic.twitter.com/Qf4QlAaKd1
— Cricket Central (@CricketCentrl) February 28, 2026