E-Paper
Advertisement

Pak-Afghan War: పాక్‌పై విరుచుకుపడ్డ తాలిబన్లు.. ఆర్మీ స్థావరాలు ధ్వంసం.. 6 ఫైటర్ జెట్స్ కూల్చివేత!

Pak-Afghan War: పాక్‌పై విరుచుకుపడ్డ తాలిబన్లు.. ఆర్మీ స్థావరాలు ధ్వంసం.. 6 ఫైటర్ జెట్స్ కూల్చివేత!
Advertisement

Pak-Afghan War: పాకిస్థాన్ – అఫ్గనిస్థాన్ మధ్య చెలరేగిన ప్రత్యక్ష యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు వైమానిక దాడులు జరుపుతున్నారు. ప్రత్యర్థి దేశంలోని ఆర్మీ స్థావరాలను నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పాక్ లోని సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన వీడియోను అఫ్గానిస్థాన్ విడుదల చేసింది. టార్గెట్ చేసి మరి వాటిని నాశనం చేసిన తీరును కళ్లకు కట్టింది.

వీడియో ఏముందంటే?

పాక్ పై జరిపిన వైమానిక దాడులకు సంబంధించిన దృశ్యాలను అఫ్గనిస్థాన్ రక్షణశాఖ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంది. పాక్ జరుపుతున్న ఎయిర్ స్ట్రైక్స్ కు కౌంటర్ గా వీటిని నిర్వహించినట్లు స్పష్టం చేసింది. వీడియోను పరిశీలిస్తే అందులో పాక్ లోని వివిధ ప్రాంతాల్లో గల ఆర్మీ స్థావరాలు, మిలటరీ క్యాంప్స్, ఆయుధ స్థావరాలను ధ్వంసం చేసినట్లు కనిపిస్తోంది.

Advertisement

ఫైటర్ జెట్ కూల్చివేత..

తమపై దాడికి వచ్చిన పాక్ ఫైజర్ జెట్ ను కూల్చివేసినట్లు తాలిబన్లు ప్రకటించారు. జలాలాబాద్ లో అది కూలిపోయిందని.. అందులోని పైలట్ ప్రాణాలతో అఫ్గాన్ సైన్యానికి పట్టుబట్టారని పేర్కొంది. పారాచూట్ తో ల్యాండ్ అయిన పైలెట్ ను స్థానికులు గుర్తించి బంధించారని.. సైన్యానికి అప్పగించారని వివరించింది. ఇప్పటివరకూ పాక్ కు చెందిన 6 యుద్ధ విమానాలను తాము కూల్చి వేసినట్లు అఫ్గాన్ రక్షణశాఖ ప్రతినిధి తాయెబ్ హమ్మద్ స్పష్టం చేశారు.

300 మంది తాలిబన్లు హతం..

Advertisement

మరోవైపు పాక్ సైతం అఫ్గాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అఫ్గాన్ పై ప్రకటించిన ఓపెన్ వార్ ఆపరేషన్ లో ఇప్పటివరకూ సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. పాక్ సమాచారమంత్రి అత్తావుల్లా తరార్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. తాలిబన్ ప్రభుత్వానికి చెందిన 297 మంది సైనికులు మరణించారు. 450 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడిలో అఫ్గాన్ సైనికుల స్థావరాలు, 135 ట్యాంకులు, సాయుధ వాహనాలు దెబ్బతిన్నాయి.

Also Read: Kavitha vs BRS: కడిగిన ముత్యమైన కవిత.. బీఆర్ఎస్‌కు బురద.. కారు పని ఖేల్ ఖతమేనా?

పాక్‌కు మద్దతుగా ట్రంప్

అఫ్గాన్ పై జరుగుతున్న యుద్ధంపై ట్రంప్ పాకిస్థాన్ కు మద్దతు ప్రకటించారు. పాక్ భయంకరంగా ఎదురుదాడి చేస్తోందని కొనియాడారు. తాను కూడా అంతేనంటూ వ్యాఖ్యానించారు. పాక్ కు గొప్ప ప్రధాని, సైనిక జనరల్ ఉన్నారని ప్రశంసించారు. వారి నాయకత్వంలో పాక్ అద్భుతంగా పనిచేస్తున్నట్లు తాను భావిస్తున్నాని పేర్కొన్నారు. పాక్ – అఫ్గాన్ యుద్ధంలో జోక్యం చేసుకుంటారా అన్న ప్రశ్నకు ట్రంప్ ఈ మేరకు చెప్పుకొచ్చారు.

Also Read: Viral Video: విషమని చెత్తలో పారేసిన.. స్వీట్స్ కోసం ఎగబడ్డ జనం.. ఇలా ఉన్నారేంట్రా!

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×