Virender Sehwag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. న్యూ చండీగఢ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans vs Rajasthan Royals, Qualifier 2) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన గుజరాత్ టైటాన్స్… 7 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఫైనల్స్ లో అడుగు పెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో కూడా గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ హిట్ వికెట్ ( Sai Sudharsan HIT WICKET) అయ్యాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఎలాగైతే, వికెట్లపై బ్యాట్ వదిలేసాడో… అచ్చం అలాగే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లోనూ సాయి సుదర్శన్ హిట్ వికెట్ అయ్యాడు. దీంతో సాయి సుదర్శన్ వరుసగా రెండు సార్లు హిట్ వికెట్ కావడంపై సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కూడా స్పందించారు. ఒరేయ్ దద్దమ్మ… ఇకపై బ్యాటింగ్ చేసేటప్పుడు గ్లోవ్స్ కు ఫెవీక్విక్ ( Feviquik ) పెట్టుకొని వెళ్ళు అంటూ సూచనలు చేశారు. అప్పుడైనా హిట్ వికెట్ కాకుండా బయట పడతావని సెటైర్లు పేల్చారు.
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ నేపథ్యంలో సాయి సుదర్శన్ హిట్ వికెట్ మరోసారి అయ్యాడు. అయితే దీనిపై వీరేంద్ర సెహ్వా చాలా సీరియస్ అయ్యారు. ఇంత నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తే నడవదని ఆగ్రహించారు. బ్యాటింగ్ చేసేటప్పుడు.. బ్యాట్ కూడా గట్టిగా పట్టుకో రాకపోతే ఎలా అని ఫైరయ్యారు. ఇకపై బ్యాటింగ్ చేసేటప్పుడు గ్లోవ్స్ కు ఫెవీక్విక్ పెట్టుకుని ఆడాలంటూ చురకలు అంటించారు. అటు 15 ఏళ్ల వైభవ సూర్యవంశీ సెంచరీ మిస్ చేసుకోవడంపై కూడా వీరేంద్ర సెహ్వాగ్ ఎమోషనల్ అయ్యారు. 90 పరుగుల వద్దకు వచ్చిన తర్వాత సిక్సర్ల కోసం వైభవ్ ప్రయత్నిస్తున్నాడు.. అది మంచి ప్రయత్నమే.. కానీ నిర్లక్ష్యంగా షాట్లు ఆడకూడదని కోరారు. ఇకనైనా 90లో అవుట్ కాకుండా… సెంచరీలు పూర్తి చేసుకోవాలని కోరాడు.
సాయి సుదర్శన్ హిట్ వికెట్ కావడంపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ కూడా తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. మ్యాచ్ గెలిచే మూమెంట్లో సాయి సుదర్శన్ హిట్ వికెట్ కావడం తనను ఆవేదనకు గురిచేసిందని వెల్లడించారు. వరుసగా రెండుసార్లు ఇలా కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఫైనల్స్ లో మాత్రం ఈ సీన్ రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సాయి సుదర్శన్ చేతులకు తాళ్లు కట్టి పంపిస్తామని సెటైర్లు పేల్చారు గిల్.
VIRENDRA SEHWAG ON SAI SUDHARSHAN HIT WICKETS 😭
Virendra Sehwag said 🗣️,
"For Sudharsan, I think they should apply some Fevikwik (strong glue) on his gloves or on the bat grip, so that it doesn't slip out of his hands at all.
In my entire career, I have never been dismissed… pic.twitter.com/SoFlwksehS— Cricket Central (@CricketCentrl) May 30, 2026