E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode May 30th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మకు చెక్ పెట్టేందుకు మనోహరి కొత్త ప్లాన్

Nindu Noorella Saavasam Serial Today Episode May 30th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మకు చెక్ పెట్టేందుకు మనోహరి కొత్త ప్లాన్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ అందరినీ తీసుకుని షాపింగ్‌కు వెళ్లగానే.. మనోహరి కొత్త ప్లాన్‌ చేస్తుంది. రణవీర్‌కు కాల్ చేసి ఒక వ్యక్తిని తీసుకెళ్లి షాపింగ్‌ మాల్‌లో మిస్సమ్మ భర్తగా అమర్‌కు పరిచయం అయ్యేలా చేయమని చెప్తుంది. రణవీర్‌ సరే అంటాడు. మనోహరి ప్లాన్‌ మొత్తం వింటారు గుప్త, నారదుడు. నారదుడు ఆశ్చర్యంగా విచిత్రగుప్త ఏంటి ఈ దుష్ట బాలిక మరీ ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నది అంటాడు. దీంతో గుప్త మీరు దీనికే ఇలా అనినా ఈ దుష్ట బాలిక ఆగడాలను ఆది నుంచి వీక్షించిన మేము ఎలా ఆలోచించాలి మహర్షి అంటాడు. దీంతో నారదుడు విచిత్ర గుప్త ఈ దుష్ట బాలికకు మీ నరకంలో ఉన్న శిక్షలు అన్ని వేసినా  సరిపోవు కదా అంటాడు. గుప్త కూడా ఈ దుష్ట బాలికను శిక్షించుటకు మేమును ఎదురుచూస్తున్నాము మహర్హి. పాపి చిరాయువు అన్నట్టు తనను ఎప్పుడు మృత్యువు కబలించునా అని మేము ఎదురుచూస్తున్నాము మహర్షి అని చెప్పగానే.. సరే ఈ దుష్ట బాలిక శిక్ష గురించి కాదు.. ఆ భాగీ బాలికకు రాబోయే ఆపద గురించి ఆలోచించు అంటాడు నారదుడు.

అమర్‌, మిస్సమ్మ పిల్లలతో కలిసి షాపింగ్‌లోకి వెళ్లగానే.. ఎదురుగా మేనేజర్‌ వచ్చి వెల్‌కం చెప్తాడు. చాలా రోజులకు వచ్చారేంటి సార్‌ అనగానే.. అమర్‌ షాక్‌ అవుతాడు.. మేము నీకు తెలుసా..? అని అడగ్గానే.. ఎందుకు తెలియదు సార్‌ నెలకోసారి మీరు మీ భార్య పిల్లలతో మా షాపు వస్తారు కదా..? అంటాడు. దీంతో అమర్‌ నా భార్యా..? ఎవరు..? అని అడగ్గానే.. మేనేజర్‌ ఈవిడే భాగీ మీ భార్య వీరే మీ పిల్లలు అంటాడు.. దీంతో అమర్‌ షాక్‌ అవుతాడు.. ఇంతలో మిస్సమ్మ, పిల్లలు మేనేజర్‌ను కన్ఫీజ్‌ చేస్తారు. ఈయన మా డాడీ కాదు.. ఈవిడ మా మిస్సమ్మ.. మేము అనాథలం మాకోసం సార్‌ ఈ మిస్సమ్మను ఏర్పాటు చేశారు అంటూ చెప్పగానే.. మేనేజర్‌ కన్పీజ్‌ అవుతుంటాడు. ఇంతలో పిల్లలు లోపలికి వెళ్లగానే.. వారి వెనకే అమర్‌ వెళ్తాడు. మిస్సమ్మ, మేనేజర్‌కు నిజం చెప్తుంది. దీంతో మేనేజర్‌ మీరు ఇక్కడి నుంచి వెళ్లే వరకు నేను మీకు హెల్ప్‌ చేస్తాను అనగానే.. మిస్సమ్మ వెళ్లిపోతుంది.

Advertisement

లోపలికి వెళ్లాక అందరూ బట్టల గురించి ఆలోచిస్తుంటే.. ఆకాష్‌ వెంటనే మనం ఎప్పుడు షాపింగ్‌కు వచ్చినా డాడీయే కదా నీకు శారీ సెలెక్షన్‌ చేసేది అంటూ చెప్పగానే.. అమర్‌ షాక్‌ అవుతాడు.. ఇంతలో మిస్సమ్మ తన మాటలతో అమర్‌ను కన్పీజ్‌ చేసి శారీ సెక్షన్‌లోకి తీసుకెళ్తుంది. మిస్సమ్మ అమర్‌ వైపు చూస్తుంటే.. అమర్‌ అదేంటి నావైపు చూస్తున్నారు..మీకు నచ్చిన శారీస్‌ తీసుకోండి అని చెప్పగానే.. మిస్సమ్మ తనకు శారీస్‌ సెలెక్షన్‌ రాదని చెప్పగానే.. మరీ మీ దగ్గర ఉన్న శారీస్‌ ఎలా సెలెక్షన్‌ చేసుకున్నారు అని అడగ్గానే.. మీరే సెలెక్షన్‌ చేశారు అనగానే.. అమర్‌ షాకింగ్‌ గా నేనేంటి అంటూ అడుగుతాడు. దీంతో అదే పిల్లలు చెప్పారు కదా మనం ప్రతిసారి షాపింగ్‌కు వచ్చినప్పుడు మీరే నాకు శారీ సెలెక్షన్‌ చేసి కొనిచ్చేవారు అని చెప్పగానే.. అయితే సరే నాకు జ్ఞాపకం లేదు కానీ ట్రై చేస్తాను అంటాడు.

మరోవైపు రణవీర్‌ ఒక వ్యక్తిని తీసుకుని అమర్‌ వాళ్లు వెళ్లిన షాపింగ్‌ మాల్‌ దగ్గరకు వెళ్తాడు. ఆ వ్యక్తికి ఇక్కడే మనకు పనుంది. నువ్వు ఈ లాప్‌ట్యాప్‌ తీసుకుని వెళ్లి నేను చెప్పినట్టు చేయ్‌ అంటాడు. ఆ వ్యక్తి సరే అంటూ షాపింగ్‌ మాల్‌ లోకి వెళ్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

Big Stories

Advertisement
×