E-Paper
Advertisement

ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ.. రూ. 2 కోట్ల విలువైన ఐఫోన్లు లూటీ!

ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ.. రూ. 2 కోట్ల విలువైన ఐఫోన్లు లూటీ!
Advertisement

Khammam: ఖమ్మం నగరంలో అర్ధరాత్రి వేళ సినీ ఫక్కీలో జరిగిన ఓ భారీ దోపిడీ కలకలం రేపింది. నగరంలోని వైరా రోడ్డులో ఉన్న ప్రముఖ ‘సోనోవిజన్’ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌ను టార్గెట్ చేసిన దుండగులు.. కోట్ల రూపాయల విలువైన మొబైళ్లను క్షణాల్లో ఊడ్చేశారు. స్టాక్ వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ దోపిడీ జరగడం స్థానికంగా సంచలనంగా మారింది.

పోలీసులు, యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు కారులో దర్జాగా షోరూమ్ ముందుకు వచ్చారు. లోపలికి చొరబడి సుమారు రూ. కోటి నుండి రూ. 2 కోట్ల విలువైన ఖరీదైన ఐఫోన్లు, ఇతర సెల్‌ఫోన్లను గుంపగుత్తగా సర్దేశారు. అయితే, లూటీ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా దుకాణంలోని సెక్యూరిటీ అలారం మోగడంతో సోనోవిజన్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే దొంగలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, దుండగులు వారి నుంచి చాకచక్యంగా తప్పించుకుని కారులో పారిపోయారు.

Advertisement

సమాచారం అందుకున్న ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది. షోరూమ్‌లోని సిసిటివి ఫుటేజీలను పరిశీలించగా, ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కొత్త స్టాక్ వచ్చిన రోజే చోరీ జరగడం వెనుక అంతర్గత వ్యక్తుల హస్తం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన నిందితులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా అనుమానిస్తూ, ఖమ్మం సరిహద్దులను అప్రమత్తం చేసి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Also Read: సొంత చెల్లికే అన్యాయం చేసిన కేటీఆర్.. మహిళల గురించి మాట్లాడతారా?- మెట్టు సాయి కుమార్

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×